మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు, సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌గా మల్టిపుల్ రోల్స్‌లో వర్క్ చేశారు. అలాగే డైరెక్షన్ సూపర్ విజన్‌ని అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు. టీజర్, మిగతా ప్రమోషనల్ కంటెంట్‌కి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. “ఇలాంటి కథ రాయడానికి ట్రూ ఇన్‌స్పిరేషన్ మై గ్రాండ్ మదర్ అండ్ మై వైఫ్. వాళ్లే నాకు ఇన్‌స్పిరేషన్. ‘రచ్చ’ సినిమా నుంచి తమన్నా గారితో జర్నీ ఉంది. తను అద్భుతమైనటువంటి పెర్ఫార్మర్. ఈ సినిమాలో శివశక్తి పాత్రని మరో స్థాయిలో చేశారు.” అని ప్రశంసించారు.
ఇంకా ఆయన ఇలా అన్నారు.. “ఈ సినిమా కోసం తమన్నా చాలా హార్డ్ వర్క్ చేశారు. మండుటెండలో చెప్పులు లేకుండా నడిచారు. ఈ సినిమా తర్వాత తమన్నా గారికి డిఫరెంట్ రోల్స్ వస్తాయి. ఆమె కోసం పాత్రలు క్రియేట్ అవుతాయి. ప్రేక్షకులకి ఈ సినిమా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది. ఏప్రిల్ 17న థియేటర్స్‌లో సినిమా చూడండి. ఖచ్చితంగా బ్లాస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: