ట్యాగ్ · 12 కథనాలు

అప్పుడు-ఇప్పుడు సూపర్ బాండింగ్
చిరు క్లారిటీ.. అందుకే సుజీత్ ప్లేస్ లో వినాయక్
సెప్టెంబర్ 22.. నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు
చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్

మథర్ థెరిస్సా ను గుర్తు చేసుకున్న మెగాస్టార్
వరల్డ్ ఫొటోగ్రఫీ డే - నేను తీసిన మొదటి ఫొటో
బాలు తెలుగు సినిమాకి ఓ అద్భుత గళం
చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్
'అమ్మ కోసం' చిరు చేపల వేపుడు
సుజీత్ ను చిరు నమ్మడానికి కారణం అదేనట..!
'లూసిఫర్' రీమేక్ కు డైరెక్టర్ ఫిక్స్
మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. మొదట వినాయక్ అన్నారు. ఆ తర్వాత వినాయక్ తప్పుకున్నాడని.. ఆ తర్వాత రీమేక్ భాద్యతలు సాహో డైరెక్టర్ సుజీత్ కు అప్పచెప్పినట్టు.. సుజీత్ కూడా కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడని అన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సుజీత్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు ఈమధ్య వార్తలు వినిపించాయి.

అప్పుడు-ఇప్పుడు సూపర్ బాండింగ్
సినీ చరిత్రలో మెగా ఫ్యామిలీకి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి కారణం ఎవరో కూడా అందరికీ తెలుసు. తెలుగు సినిమాకే కాదు.. మెగా ఫ్యామిలీకి కూడా ఒక మూలస్తంభం అయిన మెగాస్టార్ చిరంజీవి. ఇక చిరుకి తనయుడు మెగా పవర్ స్టార్ కు ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత దేశానికి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్టు.. ఎంత స్టార్, సూపర్ స్టార్ లైనా పిల్లలకు సాధారణ మనుషులే. మరి ఇక మెగా పవర్ స్టార్ రేంజ్ కు ఎదిగినా కూడా చిరు మాత్రం ఎప్పటికీ తనకు ముద్దుల కొడుకే. పలు సందర్భాల్లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మనకు తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని పిక్స్ ను చూద్దాం..
చిరు క్లారిటీ.. అందుకే సుజీత్ ప్లేస్ లో వినాయక్
ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టాలని.. ముందు రామ్ చరణ్ తో వున్న సీన్స్ పూర్తి చేయాలనీ భావిస్తోందట చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
సెప్టెంబర్ 22.. నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు
చిరంజీవి నట ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఇంత స్థాయికి ఎదిగారు కాబట్టి ఎంతో మంది నటీ నటులకు ఆయన స్ఫూర్తి. మొదట కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా పరిచయమై మెగా స్టార్ రేంజ్ కు ఎదిగాడు. ఇక చిరు మొదట నటించిన `ప్రాణం ఖరీదు` సినిమా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. దీనితో ఈ సినిమాను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేశారు చిరు.
చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్
కోట్లాది అభిమానులు అభిమానించే మెగా స్టార్ చిరంజీవి దాదాపు 10 సంవత్సరాలు సినిమాలకు దూరం అయ్యి బ్లాక్ బస్టర్ "ఖైదీ నెం 150 "మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలకు కానీ సోషల్ మీడియా కు కానీ చాలా కాలం పాటు దూరంగా ఉన్న చిరంజీవి మూవీ తో పాటు సోషల్ మీడియా లో ఎంటర్ అయ్యారు. సోషల్ మీడియా లో ఎంటర్ అయిన 24 గంటలలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకొన్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో నటిస్తున్నారు.
చిరు - మెహర్ రమేష్ సినిమా.. కన్ఫామ్ చేసిన పవన్..!
చిరుతో మెహర్ రమేష్ సినిమా చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వీరిద్దరి సినిమాను పవన్ కన్ఫామ్ చేశారు. చిరు సినిమాను పవన్ కన్ఫామ్ చేయడం ఏంటబ్బా అనుకుంటున్నారా.. అసలుసంగతేంటంటే.. నిన్న పవన్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా వేదికగా పవన్ కు విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ కూడా తన ట్విటర్ ద్వారా విషెస్ తెలిపాడు. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్ కు పవన్ రీ ట్వీట్ చేస్తూ థ్యాంక్యూ రమేష్ చిరంజీవి గారితో చేయబోతున్న సినిమాకు అల్ ద బెస్ట్ అంటూ…

మథర్ థెరిస్సా ను గుర్తు చేసుకున్న మెగాస్టార్
కేవలం సినిమా అప్ డేట్స్.. వ్యక్తిగత విషయాలు, ఫొటోస్, వీడియోస్ మాత్రమే కాదు పలు ముఖ్యమైన విషయాలను కూడా మెగా స్టార్ చిరు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. ఈరోజు మదర్ థెరీసా పుట్టినరోజు సందర్భంగా ఆమెను గుర్తుచేసుకున్నారు చిరంజీవి. తన ట్విట్టర్ ద్వారా ఆమెకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ.. `మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్లినా ప్రేమను పంచాలి.. మదర్ థెరీసా 110వ జన్మదినోత్సవం సందర్భంగా గొప్ప మాతృమూర్తిని గుర్తు చేసుకుంటున్నా. ఆమె చూపించిన స్వార్థరహిత ప్రేమ, మానవత్వం ఈ ప్రపంచాన్నే హీల్ చేస్తుంది అంటూ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
వరల్డ్ ఫొటోగ్రఫీ డే - నేను తీసిన మొదటి ఫొటో
సోషల్ మీడియాలోకి లేట్ గా ఎంట్రీ ఇచ్చినా దానిని కాస్త భిన్నంగా వాడటంతో చిరు స్టయిలే వేరే. ఏదైనా విషయాన్ని సస్పెన్స్ లో ఉంచి చెప్పడంలో చిరు తర్వాతే ఎవరైనా. తాజాగా మరోసారి అలాంటి సస్పెన్సే క్రియేట్ చేసి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచారు చిరు. ఈ రోజు వరల్డ్ ఫొటోగ్రాఫీ డే అన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీస్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈనేపథ్యంలో ఈ రోజు ప్రపంచ ఫొటోగ్రీఫీ డే.. నేను మొదటి ఫోటో తీసింది ఇలాంటి agfa3 కెమెరాతో. ఆ మొదటి ఫోటో మరి కాసేపటిలో..' అంటూ చిరంజీవి పోస్టు చేశారు. కాసేపటి తర్వాత నేను తీసిన మొదటి ఫోటో.. ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు .. చెప్పుకోండి…
బాలు తెలుగు సినిమాకి ఓ అద్భుత గళం
కరోనా పాజిటివ్ రావడంతో గత కొద్దిరోజులుగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆ తర్వాత బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని ప్రస్తుతం బాలు కోరుకుంటున్నారని.. బాలు తనయుడు చరణ్ తో పాటు వైద్యులు కూడా తెలిపారు. మరోవైపు బాలు త్వరగా కోలుకోవాలని సినీ సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్యులు కూడా ప్రార్థిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరు కూడా బాలు గారు త్వరగా కోరుకోవాలని ప్రార్దిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ లో ఒక వీడియో ను కూడా పోస్ట్ చేశారు..
చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్
"ప్రాణం ఖరీదు" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరించారు. కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసి మెగా స్టార్ గా మారి చిరంజీవి టాలీవుడ్ లో తిరుగు లేని హీరోగా రాణిస్తున్నారు. 149 సినిమాలలో నటించిన చిరంజీవి పొలిటికల్ పార్టీ "ప్రజారాజ్యం " ను స్థాపించి సినిమాలకు దూరం అయ్యారు. సుమారు 10 సంవత్సరాల తరువాత చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ గా "ఖైదీ నెం 150 "రూపొందింది. ఆ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో చిరంజీవి స్టామినా ను నిరూపించింది.
'అమ్మ కోసం' చిరు చేపల వేపుడు
లాక్ డౌన్ లో చిరు ఇంట్లో ఉంటూ బాగానే కాలక్షేపం చేస్తున్నారు. ఇక లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు తన పోస్ట్‌లతో నెటిజన్స్‌కి కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ పలు వీడియోలు సూచనలు ఇస్తూనే పలు ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు వంటలు కూడా చేస్తున్నాడు. గతంలో తన తల్లికి దోశలు ఏసిపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక ఇప్పుడు మరోసారి తనతల్లి కోసం మరో వంటను చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వంట ఏదో కాదు చేపల వేపుడు.
సుజీత్ ను చిరు నమ్మడానికి కారణం అదేనట..!
టాలీవుడ్ కో ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు.. చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో తనతో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు.. అయితే వారందరినీ పక్కన పెట్టి 'లూసిఫర్' భాద్యతలు సాహో డైరెక్టర్ సుజీత్ కు ఇవ్వడంపై అందరూ ఆశ్చర్య పోయారు. అయితే తనపై ఆ నమ్మకం ఉందని చిరు అప్పుడే చెప్పాడు. ఇక చిరుకు సుజీత్ పై అంత నమ్మకం కలగడానికి గల కారణం సాహో సినిమానేనట. దాదాపు 400 కోట్ల బడ్జెట్.. పాన్ ఇండియా ఇండియా.. ప్రభాస్, శ్రద్దా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద నటీ నటులే ఈ సినిమాలో నటించగా.. వారిని హ్యాండిల్ చేసిన విధానం ఇవి చిరు కు బాగా నచ్చాయట. దీనితో లూసిఫర్ భాద్యతలు కావాలని…