చిరు – మెహర్ రమేష్ సినిమా.. కన్ఫామ్ చేసిన పవన్..!

Power Star Pawan Kalyan Confirms Megastar Chiranjeevi Next With Director Meher Ramesh

చిరుతో మెహర్ రమేష్ సినిమా చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వీరిద్దరి సినిమాను పవన్ కన్ఫామ్ చేశారు. చిరు సినిమాను పవన్ కన్ఫామ్ చేయడం ఏంటబ్బా అనుకుంటున్నారా.. అసలుసంగతేంటంటే.. నిన్న పవన్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా వేదికగా పవన్ కు విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ కూడా తన ట్విటర్ ద్వారా విషెస్ తెలిపాడు. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్ కు పవన్ రీ ట్వీట్ చేస్తూ థ్యాంక్యూ రమేష్ చిరంజీవి గారితో చేయబోతున్న సినిమాకు అల్ ద బెస్ట్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. అంటే పవన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మెహర్ రమేష్ తో చిరు సినిమా వున్నట్టే అని కన్ఫామ్ అయినట్టే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. అయితే సినిమాలో కనిపించినంత రిచ్ నెస్ కథలో లేకపోవడంతో హిట్ అందుకోలేకపోయారు. తెలుగులో ఆయన చేసింది నాలుగు సినిమాలే. ఈయన చేసిన కంత్రి, బిల్లా, శక్తి, షాడో సినిమాల్లో బిల్లా సినిమా కాస్త ఆడింది.. ఇక మిగిలిన సినిమాలు మాత్రం డిజాస్టర్ గా నిలిచాయి. చివరి చిత్రం షాడో తర్వాత ఇంతవరకూ ఒక్క సినిమా కూడా తీయలేదు. ప్రస్తుతం కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు ఈయన. దాంతో పాటు కొన్ని యాడ్స్ కూడా చేసుకుంటున్నాడు. మరి చిరు సినిమా కనుక ఫిక్స్ అయితే ఈ సినిమాతో అయినా మెహర్ రమేష్ హిట్ కొడతాడేమో చూద్దాం.

ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా.. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను చిరంజీవి పుట్టినరోజున రిలీజ్ చేయనున్నారు. ఆగష్ట్ 22న సాయంత్రం 4గంటలకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ తో సినిమా ఉంటుందేమో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − two =