బాలు తెలుగు సినిమాకి ఓ అద్భుత గళం

Mega Star Chiranjeevi Shows His Concern For SP Balabasubramanyam Health Condition

కరోనా పాజిటివ్ రావడంతో గత కొద్దిరోజులుగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆ తర్వాత బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని ప్రస్తుతం బాలు కోరుకుంటున్నారని.. బాలు తనయుడు చరణ్ తో పాటు వైద్యులు కూడా తెలిపారు. మరోవైపు బాలు త్వరగా కోలుకోవాలని సినీ సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్యులు కూడా ప్రార్థిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరు కూడా బాలు గారు త్వరగా కోరుకోవాలని ప్రార్దిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ లో ఒక వీడియో ను కూడా పోస్ట్ చేశారు..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోటానుకోట్ల మంది అభిమాన గాయకుడు, దేశం గర్వించే అత్యుత్తమ కళాకారుడు, నా సోదర సమానులు ఎస్.పి. బాలు.. రోజురోజుకీ కోలుకుంటున్నారని, వైద్యానికి మెరుగ్గా స్పందిస్తున్నారని విని సంతోషిస్తున్నాను. ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చాను. బాలుతో నాకు సినిమా పరమైన అనుబంధమే కాదు.. కుటుంబపరంగా కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది. చెన్నైలో పక్కపక్క వీధుల్లో ఉంటూ తరుచూ కలుసుకునే వాళ్లం. ఎన్నో సంవత్సరాల వ్యక్తిగత అనుబంధం మాది. తనని అన్నయ్యా అంటూ నేను ఆప్యాయంగా పిలుస్తుంటాను. అలాగే ఆయన చెల్లెళ్లు ఎస్.పి. వసంత, శైలజ కూడా నన్ను అన్నయ్యలాగే చూసుకుంటారు. బాలు ఆరోగ్య పరిస్థిని గత మూడు రోజులుగా వసంత, శైలజ, శుభలేఖ సుధాకర్‌లతో మాట్లాడి తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ రోజు కూడా తన ఆరోగ్యం గురించి వారితో మాట్లాడాను. బాలు ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు చెప్పిన మాట నాకు ఎంతో తృప్తినిచ్చింది. రోజురోజుకి ఆరోగ్యం మెరుగవుతుందనే మాటలు నాకు చాలా సంతోషాన్నిచ్చాయి. బాలు తెలుగు సినిమాకి ఓ అద్భుతం. ఆ మాటకొస్తే.. భారతీయ సినిమాకు ఆయన ఊపిరే రాగం, తానం, పల్లవి. త్వరగా కోలుకుని, ఆ గళం విప్పాలని, కోటి రాగాలు తీయాలని, భారతీయులందరినీ ఉర్రూతలూగించాలని, అలరించాలని, ఆయనకున్న కోట్లాది మంది అభిమానులతో పాటు నేనూ ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. అందరి ప్రార్థనలు, ఆ దేవుడి ఆశీస్సులు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తుంది. త్వరగా బాలు మనముందుకు వచ్చి, రెట్టింపు ఉత్సాహంతో మరింతగా అలరించాలని, ఆహ్లాదపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కోసం మనం అందరి కలిసి ఆ భగవంతుడిని వేడుకుందాం..’’ అని అన్నారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 18 =