ట్యాగ్ · 13 కథనాలు
'ఆచార్య' కూడా రెడీ అవుతున్నాడు

అప్పుడు-ఇప్పుడు సూపర్ బాండింగ్
ఆ సినిమా కోసమే గుండు లుక్ ట్రై చేశాం ..!
చిరు క్లారిటీ.. అందుకే సుజీత్ ప్లేస్ లో వినాయక్
సెప్టెంబర్ 22.. నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు
చిరు 'అర్బన్ మాంక్' లుక్ సీక్రెట్ రివీల్
చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్
చిరంజీవి కొత్త అవతారం
ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్..?
సచిన్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు
'లూసిఫర్' రీమేక్ కు డైరెక్టర్ ఫిక్స్
మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. మొదట వినాయక్ అన్నారు. ఆ తర్వాత వినాయక్ తప్పుకున్నాడని.. ఆ తర్వాత రీమేక్ భాద్యతలు సాహో డైరెక్టర్ సుజీత్ కు అప్పచెప్పినట్టు.. సుజీత్ కూడా కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడని అన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సుజీత్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు ఈమధ్య వార్తలు వినిపించాయి.
'ఆచార్య' కూడా రెడీ అవుతున్నాడు
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఇప్పటికే షూటింగ్ లు మొదలు పెట్టారు. కొంతమంది మిగిలిఉన్న షూటింగ్ భాగాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక అగ్ర హీరోల్లో నాగార్జున అయితే ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టారు . అది కూడా ఇక్కడ కాదు మనాలిలో ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూట్ లో వున్నారు. ఇక ఇప్పుడు చిరు కూడా సెట్స్ పైకి రావడానికి సిద్ధమవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కనుక లేకపోతే దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది.

అప్పుడు-ఇప్పుడు సూపర్ బాండింగ్
సినీ చరిత్రలో మెగా ఫ్యామిలీకి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి కారణం ఎవరో కూడా అందరికీ తెలుసు. తెలుగు సినిమాకే కాదు.. మెగా ఫ్యామిలీకి కూడా ఒక మూలస్తంభం అయిన మెగాస్టార్ చిరంజీవి. ఇక చిరుకి తనయుడు మెగా పవర్ స్టార్ కు ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత దేశానికి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్టు.. ఎంత స్టార్, సూపర్ స్టార్ లైనా పిల్లలకు సాధారణ మనుషులే. మరి ఇక మెగా పవర్ స్టార్ రేంజ్ కు ఎదిగినా కూడా చిరు మాత్రం ఎప్పటికీ తనకు ముద్దుల కొడుకే. పలు సందర్భాల్లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మనకు తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని పిక్స్ ను చూద్దాం..
ఆ సినిమా కోసమే గుండు లుక్ ట్రై చేశాం ..!
ఇటీవల అర్బన్ మాంక్ లుక్ తో మెగా స్టార్ చిరంజీవి మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్ మేకింగ్ వీడియోను 'మేకింగ్ ఆఫ్ ద అర్బన్ మాంక్' పేరుతో ఇటీవలే తన ఇన్‌స్టా లో విడుదల చేసి గుండు చేయించుకోలేదని చిరు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు ఈ లుక్ ఎందుకు..? ఏదైనా సినిమా కోసమా..? అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ ఇంకా ఉంది. అయితే 'వేదాళం' రీమేక్ కోసమే ఈ గుండు లుక్‌ను ప్రయత్నిస్తున్నారని టాక్ కూడా వినిపించింది. ఇక లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తన గుండు లుక్‌పై క్లారిటీ ఇచ్చారు. 'వేదాళం' రీమేక్ కోసమే గుండు లుక్‌ను ట్రై చేస్తున్నట్లు, అయితే ఆ లుక్ ఇంకా ఫైనలైజ్ కాలేదని…
చిరు క్లారిటీ.. అందుకే సుజీత్ ప్లేస్ లో వినాయక్
ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టాలని.. ముందు రామ్ చరణ్ తో వున్న సీన్స్ పూర్తి చేయాలనీ భావిస్తోందట చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
సెప్టెంబర్ 22.. నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు
చిరంజీవి నట ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఇంత స్థాయికి ఎదిగారు కాబట్టి ఎంతో మంది నటీ నటులకు ఆయన స్ఫూర్తి. మొదట కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా పరిచయమై మెగా స్టార్ రేంజ్ కు ఎదిగాడు. ఇక చిరు మొదట నటించిన `ప్రాణం ఖరీదు` సినిమా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. దీనితో ఈ సినిమాను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేశారు చిరు.
చిరు 'అర్బన్ మాంక్' లుక్ సీక్రెట్ రివీల్
సోషల్ మీడియాలో ఏదో ఒక సస్పెన్స్ క్రియేట్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటే. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండీ ఇప్పటివరకూ ఏదో ఒక సర్ ప్రయిజ్ ఇస్తూనే వున్నారు. ఇక ఇటీవల అర్బన్ మాంక్ లుక్ తో మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసేశాడు. అసలు ఈ లుక్ ఎందుకు..? ఏదైనా సినిమా కోసమా..? లేకపోతే మామూలుగానే గుండుచేపించుకున్నారా? అబ్బో ఎవరికి తోచిన ఆలోచన వాళ్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లుక్ వెనుక వున్న సీక్రెట్ ఏంటో చెప్పేసారు చిరు.
చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్
కోట్లాది అభిమానులు అభిమానించే మెగా స్టార్ చిరంజీవి దాదాపు 10 సంవత్సరాలు సినిమాలకు దూరం అయ్యి బ్లాక్ బస్టర్ "ఖైదీ నెం 150 "మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలకు కానీ సోషల్ మీడియా కు కానీ చాలా కాలం పాటు దూరంగా ఉన్న చిరంజీవి మూవీ తో పాటు సోషల్ మీడియా లో ఎంటర్ అయ్యారు. సోషల్ మీడియా లో ఎంటర్ అయిన 24 గంటలలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకొన్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో నటిస్తున్నారు.
చిరంజీవి కొత్త అవతారం
మెగా అభిమానుల ఆరాధ్య దైవం మెగా స్టార్ చిరంజీవి దాదాపు 10 సంవత్సరాల తరువాత బ్లాక్ బస్టర్ మూవీ "ఖైదీ నెం 150 " తో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో చిరంజీవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక, అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. తరువాత "సైరా నరసింహా రెడ్డి " మూవీ లో తన నటనా విశ్వరూపం ప్రదర్శించి చిరంజీవి ఆకట్టుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో నటిస్తున్నారు. "
చిరు - మెహర్ రమేష్ సినిమా.. కన్ఫామ్ చేసిన పవన్..!
చిరుతో మెహర్ రమేష్ సినిమా చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వీరిద్దరి సినిమాను పవన్ కన్ఫామ్ చేశారు. చిరు సినిమాను పవన్ కన్ఫామ్ చేయడం ఏంటబ్బా అనుకుంటున్నారా.. అసలుసంగతేంటంటే.. నిన్న పవన్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా వేదికగా పవన్ కు విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ కూడా తన ట్విటర్ ద్వారా విషెస్ తెలిపాడు. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్ కు పవన్ రీ ట్వీట్ చేస్తూ థ్యాంక్యూ రమేష్ చిరంజీవి గారితో చేయబోతున్న సినిమాకు అల్ ద బెస్ట్ అంటూ…
ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్..?
కొరటాల దర్శకత్వంలో మెగా స్టార్ చిరు నటిస్తున్న ఆచార్య సినిమా ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రెండుమూడు రోజుల క్రితమే ఈ సినిమా కథపై ఆరోపణలు వచ్చాయి. వాటికి చిత్రయూనిట్, కొరటాల క్లారిటీ ఇచ్చారనుకోండి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చేసింది రీసెంట్ గానే. ఓఇంటర్వ్యూ లో పాల్గొన్న రామ్ చరణ్ తాను ఈ సినిమాలో నటిస్తున్నట్టు.. ఇన్నేళ్ల తర్వాత తన తల్లి కోరిక తీరుతున్నట్టు చెప్పాడు. ఇక ఇదిలా వుండగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
'చిరు 152' ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
చిరు పుట్టినరోజు కు ఇంకా నాలుగు రోజులు టైం ఉండగానే సోషల్ మీడియాలో అప్పుడే హంగామా మొదలైంది. ఇప్పటికే చిరు పుట్టినరోజుకు ఏదో ఒకటి కొత్తగా చేయాలన్న ఆలోచనతో కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 65 మంది సినీ ప్రముఖులతో చిరు కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక కామన్ డీపీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.
సచిన్ కు చిరంజీవి బర్త్ డే శుభాకాంక్షలు
ఇంటర్నేషనల్ క్రికెటర్, మాజీ ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్ కెప్టెన్ , హైయెస్ట్ రన్ స్కోరర్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గా రికార్డ్ క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్ బర్త్ డే సందర్భంగా రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.