చిరంజీవి కొత్త అవతారం

Megastar Chiranjeevi Surprises Audience With His New Look.

మెగా అభిమానుల ఆరాధ్య దైవం మెగా స్టార్ చిరంజీవి దాదాపు 10 సంవత్సరాల తరువాత బ్లాక్ బస్టర్ మూవీ “ఖైదీ నెం 150 ” తో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో చిరంజీవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక, అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. తరువాత “సైరా నరసింహా రెడ్డి ” మూవీ లో తన నటనా విశ్వరూపం ప్రదర్శించి చిరంజీవి ఆకట్టుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో నటిస్తున్నారు. ”

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆచార్య ” మూవీ తరువాత “లూసిఫర్ “(మలయాళ ), “వేదాళం “(తమిళ ) మూవీస్ తెలుగు రీమక్స్ కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు ఒక కొత్త లుక్ తో ప్రేక్షక, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అర్బన్ మాంక్ హ్యాష్ ట్యాగ్ తో గుండు తో ఉన్న తన ఫోటోను చిరంజీవి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఏదైనా మూవీ షూటింగ్ కు సంబంధించిన ఫొటో నా , నిజం గా చిరంజీవి గుండు చేయించుకొన్నారా అన్నది సస్పెన్స్. ఏది ఏమైనా చిరంజీవి ని గుండు అవతారంలో ప్రేక్షక, అభిమానులు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు గుండు తో ఉన్న చిరంజీవి ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =