చిరు ‘అర్బన్ మాంక్’ లుక్ సీక్రెట్ రివీల్

Megastar Chiranjeevi Secret Behind His Latest Transformation In To An Urban Monk Revealed

సోషల్ మీడియాలో ఏదో ఒక సస్పెన్స్ క్రియేట్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటే. సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండీ ఇప్పటివరకూ ఏదో ఒక సర్ ప్రయిజ్ ఇస్తూనే వున్నారు. ఇక ఇటీవల అర్బన్ మాంక్ లుక్ తో మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసేశాడు. అసలు ఈ లుక్ ఎందుకు..? ఏదైనా సినిమా కోసమా..? లేకపోతే మామూలుగానే గుండుచేపించుకున్నారా? అబ్బో ఎవరికి తోచిన ఆలోచన వాళ్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లుక్ వెనుక వున్న సీక్రెట్ ఏంటో చెప్పేసారు చిరు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ లుక్‌ ఎలా సాధ్యమైందో చెబుతూ దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను తన ఇన్స్టా లో విడుదల చేశారు. ‘మేకింగ్ ఆఫ్ ద అర్బన్ మాంక్’..‌. ప్రతి ఒక్కరు నమ్మేలా లుక్‌ని మేకోవర్ చేసే ఇండస్ట్రీలోని ప్రతి టెక్నీషియన్‌కి థ్యాంక్స్‌. సినిమా మ్యాజిక్‌కి సెల్యూట్‌” అంటూ కామెంట్ పెట్టారు. మరి ఇంతకీ ఈ లుక్ ఎందుకో అన్న విషయం మాత్రం ఇంకా సీక్రెట్ గానే ఉంచారు.

 

 

View this post on Instagram

 

Thanks to all the technicians of the industry, who can make any look believable. Salute the magic of cinema!

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

కాగా ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టాలని.. ముందు రామ్ చరణ్ తో వున్న సీన్స్ పూర్తి చేయాలనీ చిత్రయూనిట్ భావిస్తోందట. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ తో సినిమా ఉంటుందేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + seven =