
ట్యాగ్ · 51 కథనాలు · పేజీ 3


'ఆచార్య' బ్యాక్ డ్రాప్ అదే
ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు
'ఆచార్య' లో విలన్ గా 'జిషు సేన్ గుప్తా'

2021 'మెగా' సినిమాలు

ఆచార్య టీజర్ రిలీజ్ - దైవమే కాపాడాల్సిన పనిలేదు

'ఆచార్య' టీజర్ కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'ఆచార్య' వచ్చేది అప్పుడేనట..!

"ఆచార్య "కొత్త పోస్టర్ రిలీజ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య “మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ , పూజాహెగ్డే నీలాంబరి గా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

"ఆచార్య " మూవీ "లాహే లాహే "సాంగ్ ప్రోమో రిలీజ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన "ఆచార్య "మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే ఒక జంటగా నటిస్తున్నారు. సోనూసూద్, ముఖ్య పాత్రలలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

'ఆచార్య' బ్యాక్ డ్రాప్ అదే
మెగాస్టార్ చిరు ఈమధ్య తన సినిమా లో సస్పెన్స్ ఎలిమెంట్స్ ను ముందుగానే చెప్పేస్తున్నారు. అసలు ఆచార్య టైటిల్ ను ఎలా చెప్పేశారో గుర్తుండే ఉంటుంది కదా. పాపం కొరటాలశివ చాలా గ్రాండ్ గా సస్పెన్స్ తో ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేద్దామనుకుంటే ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కువచ్చిన ఆయన ఎగ్జైట్ మెంట్ తో సినిమా టైటిల్ ను చెప్పేశాడు.
మెగా అభిమానులకు "ఆచార్య " మూవీ బిగ్గెస్ట్ ఫీస్ట్ -కాజల్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న " ఆచార్య "మూవీ మే 13వ తేదీ రిలీజ్ కానుంది. "ఆచార్య "మూవీ లో హీరో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించారు. హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు
కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరు తనయుడు చెర్రీ కూడా నటిస్తుండతంతో ఈసినిమాపై క్రేజ్ ఇంకా పెరిగింది. ప్రస్తుతం సినిమా మారేడు మిల్లిలోని అటవీ ప్రాంతంలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. చిరంజీవి, చరణ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ద్వారా బయటకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.
'ఆచార్య' లో విలన్ గా 'జిషు సేన్ గుప్తా'
మొత్తానికి ఆచార్య ను ఢీ కొట్టగలిగే విలన్ దొరికాడు డైరెక్టర్ కొరటాల శివకు. షూటింగ్ దాదాపు పూర్తవ్వడానికి వస్తున్నా విలన్ పాత్రను మాత్రం ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్లీ ఆ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. చిరుకు విలన్ గా జిషు సేన్ గుప్తాను సెలెక్ట్ చేశారు.

2021 'మెగా' సినిమాలు
కరోనా ఎఫెక్ట్ తో గత ఏడాది రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు ఈ ఏడాదికి షిఫ్ట్ అయిపోయాయి. అందుకే షూటింగ్ అయిపోయిన సినిమాలు..అవ్వని సినిమాలు.. షూటింగ్ మొదలుకాని సినిమాలు ఇలా చాలా వరకు ముందుగానే రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 40కి పైగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అంతేకాదు ఈఏడాది మొత్తం మెగా హీరోల హవానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మెగా కాంపౌండ్ నుండే దాదాపు అరడజను సినిమాలకు పైగా రానున్నాయి.

ఆచార్య టీజర్ రిలీజ్ - దైవమే కాపాడాల్సిన పనిలేదు
ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ వచ్చేసింది. ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేస్తానని చెప్పిన ఆచార్య టీం చెప్పినట్టే టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక మెగా అభిమానుల ఆశించినట్టే.. వారి అంచనాలకు తగ్గట్టే ఈ టీజర్ ఉంది. ముందు నుండి చెప్పినట్టే రామ్ చరణ్ వాయిస్ తో టీజర్ ప్రారంభమైంది. మెగా స్టార్ మార్క్.. గ్రేస్ రెండూ టీజర్ లో కనిపిస్తున్నాయి. వయసు అనేది కేవలం నెంబర్ అన్నట్టు యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చిరు చేసిన యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అంతేకాదు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో…

'ఆచార్య' టీజర్ కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
ఆచార్య టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ఈ రోజు ఉదయాన్నే మెగా అభిమానులకు కొరటాల సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఫ్యాన్స్ 29 కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇంకా ఆ సంతోషంలో ఉండగానే ఇప్పుడు మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టడంతో ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఆచార్య టీజర్ లో చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా... అహా బయట టాకు' అంటూ బ్రహ్మానందం ఫొటోతో ఉన్న ఒక మీమ్ ను పోస్ట్ చేసాడు. మరి స్వయంగా వరుణే ఈ ట్వీట్ చేయడంతో ఇది నిజమే అన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.
'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా స్టార్ నటిస్తున్న ఆచార్య సినిమా టీజర్ కోసం ఎంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా అయినా టీజర్ రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ టీజర్ రాలేదు. ఫైనల్లీ మెగా అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అప్ డేట్ అయితే వచ్చేసింది. ఆచార్య సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసి ప్రకటించారు డైరెక్టర్ కొరటాల. టీజర్ రిలీజ్ విషయంపై చిరు-కొరటాల మధ్య ఫన్నీ సంభాషణ జరిగినట్టు చిరు తన ట్వీట్ లో పోస్ట్ చేయగా దానిపై మెగా అభిమానులతో పాటు పలువురు హీరోలు కూడా కామెడీగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇక నేడు టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జనవరి 29వ తేదీన…

'ఆచార్య' వచ్చేది అప్పుడేనట..!
ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను అనుకున్న టైం కే తీసుకురావాలని... తొందరగా సినిమాను ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అన్ని పనులు తొందరగా పూర్తి చేసి ఆగస్టు 14 న విడుదల చేయాలని చూస్తున్నారట. ఎట్టి పరిస్థితులలో ఆగస్ట్ 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.మరి రీసెంట్ గానే సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్ లో మన సినిమా 100 రోజులలో పూర్తి చేయాలని చిరంజీవి దర్శకుడు కొరటాల దగ్గర మాట తీసుకున్నారు. అలా చిరంజీవి కోరుకున్నట్లు జరిగితే ఆగస్ట్ మిస్ అయ్యే సమస్యే లేదు.