కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ” ఆచార్య “మూవీ మే 13వ తేదీ రిలీజ్ కానుంది. “ఆచార్య “మూవీ లో హీరో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించారు. హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆచార్య “మూవీ కథానాయిక కాజల్ అగర్వాల్ ఆ మూవీ గురించి మాట్లాడుతూ .. “ఆచార్య “మూవీ లో చిరంజీవి , రామ్ చరణ్ ల మధ్య సీన్స్ మెగాఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇస్తాయనీ , దర్శకుడు కొరటాల ఆ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించారనీ , ముఖ్యంగా హీరో చిరంజీవి క్యారెక్టర్ మాస్ ఆడియెన్స్ ను అలరించేలా సాలిడ్ గా ఉంటుందనీ , “ఆచార్య “మూవీ మెగా ఫ్యాన్స్ కు పెద్ద విందు అనీ కాజల్ చెప్పారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “ఆచార్య “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: