
ట్యాగ్ · 32 కథనాలు · పేజీ 2


సర్పైజ్ కోసం చూడమంటున్న బాలయ్య
బాలకృష్ణకి విలన్ గా శ్రీకాంత్?
దసరాకు బాలకృష్ణ సినిమా టీజర్..?
అప్పుడే డబ్బింగ్ మొదలుపెట్టిన బాలకృష్ణ

బాలకృష్ణ ‘అశోక చక్రవర్తి’కు 30 ఏళ్ళు

`రూలర్`గా బాలకృష్ణ?

బాలకృష్ణ సినిమాలో లేడీ విలన్?

కన్నడ చిత్రంలో గెస్ట్ రోల్‌లో బాలయ్య?

స్పీడుమీదున్న 'బాలయ్య'
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు ఒక్క సినిమాలు చేస్తుంటే వీళ్లు మాత్రం ఒక్కోక్కరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది.ఈసినిమాత తరువాత గోపిచంద్ మలినేని తో మరొక సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు గోపిచంద్ మలినేని. అఖండ అయిపోయిన వెంటనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

సర్పైజ్ కోసం చూడమంటున్న బాలయ్య
మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో అఖండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. దాాదాపు చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. ఈకరోనా లేకపోతే మరో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వాలి. ఇక ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నాడు.

సెంటిమెంట్ డ్రామాగా బాలకృష్ణ, బి. గోపాల్ చిత్రం?
నటసింహ నందమూరి బాలకృష్ణ, ఏస్ డైరెక్టర్ బి. గోపాల్ సుదీర్ఘ విరామం తరువాత మరోమారు జట్టుకడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకి కథను అందిస్తున్నాడని, కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే చిత్రంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని వినిపిస్తోంది. పెద్దలతో, తల్లిదండ్రులతో, తోడబుట్టినవాళ్ళతో ఎలా నడుచుకోవాలో, వారిని ఎలా ట్రీట్ చేయాలో చెప్పే కథాంశంతో బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ మూవీ ఉంటుందని సమాచారం.
బాలకృష్ణకి విలన్ గా శ్రీకాంత్?
బ్లాక్ బస్టర్స్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన కాంబినేషన్ ల్లో నటసింహ బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను జోడీ ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన `సింహా`(2010), `లెజెండ్`(2014) సంచలన విజయం సాధించడమే కాకుండా ఆ యా సంవత్సరాలలో హయ్యస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. కట్ చేస్తే... ఐదేళ్ళ విరామం అనంతరం ఈ సెన్సేషనల్ కాంబినేషన్ మరోసారి జట్టుకడుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఇటీవలే పూజ జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.
దసరాకు బాలకృష్ణ సినిమా టీజర్..?
`జై సింహా` తరువాత బాలకృష్ణ, కె.యస్.రవికుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు డబ్బింగ్ వర్క్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బాలకృష్ణ తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారట.
అప్పుడే డబ్బింగ్ మొదలుపెట్టిన బాలకృష్ణ
`జై సింహా` తరువాత నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలయ్యకి జోడీగా వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తుండగా... కీలక పాత్రల్లో భూమికా చావ్లా, జయసుధ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. `గౌతమిపుత్ర శాతకర్ణి`, `జై సింహా` చిత్రాల స్వరకర్త చిరంతన్ భట్ బాణీలు అందిస్తున్నాడు.

బాలకృష్ణ ‘అశోక చక్రవర్తి’కు 30 ఏళ్ళు
యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి పెట్టింది పేరు నందమూరి బాలకృష్ణ. ఈ నేపథ్యంలో బాలయ్య కథానాయకుడిగా నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసాయి. వాటిలో ‘అశోక చక్రవర్తి’ ఒకటి. మలయాళ చిత్రం ‘ఆర్యన్’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకి ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించారు. బాలకృష్ణ, భానుప్రియ జంటగా నటించిన ఈ చిత్రంలో అంజలీదేవి, జె.వి.సోమయాజులు, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, ‘శుభలేఖ’ సుధాకర్, రంగనాథ్, శరత్ సక్సేనా, సుపర్ణా ఆనంద్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి కాజా వెంకటరావమ్మ ఈ సినిమాని నిర్మించారు.

`రూలర్`గా బాలకృష్ణ?
ఒకప్పుడు తెలుగు టైటిల్స్‌తోనే అలరించిన నందమూరి బాలకృష్ణ… ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ టైటిల్స్ పై ఫోకస్ పెడుతున్నారు. ‘లెజెండ్’, ‘లయన్’, ‘డిక్టేటర్’… వంటి ఇంగ్లీష్ టైటిల్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య. అంతేకాదు… తన అప్‌కమింగ్ మూవీకి కూడా ఇంగ్లీష్ టైటిల్‌నే ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్ టాక్.

బాలకృష్ణ సినిమాలో లేడీ విలన్?
‘పందెం కోడి 2’, ‘సర్కార్’, ‘మారి 2’ వంటి తమిళ అనువాద చిత్రాలలో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కోలీవుడ్ యాక్ట్రస్ వరలక్ష్మి శరత్ కుమార్. ఆ యా చిత్రాల్లో విలనిజాన్ని పండించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఈ సారి తెలుగులో ఓ అగ్ర కథానాయకుడి సినిమాలో విలన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

`మహానాయకుడు` విడుదల రోజే... బాలయ్య కొత్త చిత్రం ప్రారంభం?
రెండు మాసివ్ హిట్స్ (`సింహా`, `లెజెండ్`) తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను... మరో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎన్.బి.కె.ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ స్వయంగా నిర్మించనున్న ఈ సినిమాని `యన్.టి.ఆర్. మహానాయకుడు` విడుదల తేది అయిన ఫిబ్రవరి 22న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతేకాదు... ఎన్నికల సమయంలో చిత్రీకరణకు విరామం ఇచ్చి... ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. కాగా... ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ దాదాపుగా కన్‌ఫర్మ్…

కన్నడ చిత్రంలో గెస్ట్ రోల్‌లో బాలయ్య?
నటసింహ నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రల్లో కనిపించిన సందర్భాలు అరుదనే చెప్పాలి. `త్రి మూర్తులు` (1987), `ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?` (2012) చిత్రాల్లో ఆయన స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. మళ్ళీ...చాన్నాళ్ళ తరువాత ఓ సినిమా కోసం గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారట బాలయ్య. అయితే... ఈ సారి తెలుగు చిత్రంలో కాదు.. ఓ కన్నడ చిత్రంలో నటించేందుకు ఈ నందమూరి అందగాడు సిద్ధమవుతున్నారట.

2018 లాగానే 2019 లో టాలీవుడ్ కు ప్రారంభ విజయాన్ని అందించిన బాలకృష్ణ
2018 సంవత్సర ప్రారంభంలో “జై సింహా ” హిట్ ద్వారా టాలీవుడ్ కు తొలి విజయాన్ని అందించిన నందమూరి నటసింహం బాలకృష్ణ 2019 లో కూడా తొలి విజయాన్ని నమోదు చేసుకుని టాలీవుడ్ కు మరో శుభారంభాన్నిచ్చారు. ఈ రోజు విడుదలైన "ఎన్టీఆర్ కథానాయకుడు" సూపర్ హిట్ అనే టాక్ ను సొంతం చేసుకోవడంతో బాలయ్య వరుసగా రెండవసారి సంక్రాంతి స్టార్ గానే కాకుండా "ది బెస్ట్ బిగినర్ ఆఫ్ ద ఇయర్" గా నిలిచారు.