కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Rakul Preet Singh

ట్యాగ్ · 52 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

నో సండేస్ &హాలీడేస్ - రకుల్ ప్రీత్

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో రకుల్ ఎదురుచూచుస్తున్నారు. 5 నెలల తరువాత ఎట్టకేలకు షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రకుల్ ప్రస్తుతం రెండు హిందీ , రెండు తమిళ , ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త కలలు కంటూనే ఉంటా - రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు ,తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ ప్రస్తుతం ఆయా భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు . దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో "ఉప్పెన "మూవీ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ కి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ హీరోలతో పాటు యువ హీరోల తో కూడా రకుల్ నటించడం విశేషం.కరోనా భయం తో మూవీ షూటింగ్స్ లో పాల్గొనడానికి హీరోయిన్స్ వెనుకంజ వేస్తున్న తరుణంలో రకుల్ షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధం అయ్యారు.

Team TFNవాట్సాప్
Rakul Preet Accepts Samantha's Challenge
సినిమా వార్తలు

సామ్ 'గ్రో విత్ మీ' ఛాలెంజ్ పూర్తి చేసిన రకుల్

'గ్రో విత్ మీ' ఛాలెంజ్.. సమంత కొత్తగా ముందుకు తీసుకొచ్చిన ఛాలెంజ్. లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోరకంగా వాడుకుంటున్నారు. అయితే ఈ లాక్ డౌన్ స‌మ‌యాన్ని క‌రెక్ట్‌గా వినియోగించుకుంటున్న వారిలో స‌మంత కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే స‌మంత అర్బన్‌ వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ లోని తన నివాసంలోని టెర్రస్‌పై ఉన్న ఖాళీ ప్లేస్లో సేంద్రీయ పద్దతుల్లో కూరగాయల్ని పండిస్తోంది. ఇక తాను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇలానే కాయకూరల్ని పండించుకొని తినాలని కూడా పిలునిస్తుంది. అంతేనా కావాల్సిన టిప్స్ కూడా చెపుతుంది సామ్. ఇక ఈ ఆలోచనలో భాగంగానే వచ్చిందే ' 'గ్రో…

TFN Adminవాట్సాప్
Actress Rakul Preet Singh Black and White Photo Posted On Instagram Attracts Netizens Attention
సినిమా వార్తలు

సండే మూడ్ లో రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో రకుల్ ప్రీత్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోయిన్ రకుల్ ప్రస్తుతం రెండు హిందీ మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్న రకుల్ , దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో "ఉప్పెన " మూవీ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు. కరోనా కారణం గా స్టార్ హీరోయిన్స్ షూటింగ్స్ లో పాల్గొనడానికి వెనుకంజ వేస్తున్న తరుణం లో రకుల్ ధైర్యం గా షూటింగ్స్ లో పాల్గొనడం విశేషం.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

చాలా మిస్ అయ్యా .. బ్యాక్ టు వర్క్..!

లాక్ డౌన్ వల్ల దాదాపు ఐదు నెలల నుండి షూటింగ్స్ లేకుండా పోయిన సంగతి తెలిసిందే కదా. షూటింగ్స్ లేక సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఏదో ఒకటి రెండు నెలలు అంటే ఒకే కానీ మరి ఎప్పుడూ బిజీగా వుండే వాళ్ళు ఇన్ని నెలలు పని లేకుండా ఇంట్లోనే ఉండాలంటే కష్టమే. ఈ నేపథ్యంలో షూటింగ్ ను చాలా మిస్ అయ్యాను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆ సినిమాలో రకుల్ లేనట్టే..!

చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలావరకు లవ్ స్టోరీ షూటింగ్ కూడా జరపుకుంది. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య - టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో కూడా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘మనం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నిజానికి 'లవ్ స్టోరీ' సినిమా తరువాత ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'నాగేశ్వరరావ్' చేయవలసి వుంది. కానీ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రకుల్-మంచు లక్ష్మీ.. సరదాగా సైక్లింగ్

టాలీవుడ్ లో రకుల్-మంచు లక్ష్మీ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కూడా అప్పుడప్పుడు కలుస్తూ సరదాగా కాలక్షేపం చేస్తూనే ఉన్నారు. ఇక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఎప్పుడూ తన సోషల్‌మీడియా అకౌంట్లలలో షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరో వీడియోను షేర్‌ చేసింది. రకుల్- మంచు లక్ష్మీ సరదాగా సైక్లింగ్ కు వెళ్లినట్టు తెలుస్తుంది ఆ వీడియోను చూస్తుంటే. వీడియోతో పాటు కొన్ని ఫోటోలను కూడా రకుల్‌ షేర్‌ చేసింది. ప్ర‌ముఖ సైక్లిస్ట్ ఆదిత్యా మెహ‌తాతో క‌లిసి ర‌కుల్ ప్రీత్ సింగ్, ల‌క్ష్మి మంచు హైద‌రాబాద్ రోడ్ల‌పై…

TFN Adminవాట్సాప్
Director Krish To Come Up With A New Movie With This Fresh Combination
సినిమా వార్తలు

వైష్ణవ్ తేజ్ - రకుల్ సినిమా లాంచ్

మెగా కాంపౌండ్ నుండి వెండి తెరకు పరిచయమవుతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఇప్పటికే 'ఉప్పెన' సినిమా తెరకెక్కింది. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది.. ఎప్పుడో వైష్ణవ్ తేజ్ వెండి తెరకు పరిచయం అయ్యేవాడు. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే సినిమాపై మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అవుట్ సైడర్-ఇన్ సైడర్ కాదు.. టాలెంటే ముఖ్యం..!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని మరణించిన తర్వాత నేపోటిజం పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సెలెబ్రిటీస్ దీనిపై స్పందించారు. కొంతమందికి బంధుప్రీతి ఉంటుంది అంటే కొంత ఉంటే తప్పేంటి అని ఇలా ఎవరికి నచ్చిన వెర్షన్స్ వాళ్ళు వినిపించారు. ఇప్పుడు ఇక ఈ నేపోటిజంపై రకుల్ ప్రీత్ కూడా మాట్లాడుతూ తన అభిప్రాయం ఏంటో కూడా చెప్పుకొచ్చిది. అవుట్ సైడర్-ఇన్ సైడర్ ఇంకా ఇండస్ట్రీ నాన్ ఇండస్ట్రీ ఉంటుందని నేను అనుకోవట్లేదు.. ఏ ఇండస్ట్రీ అయినా ఎవరి కెరీర్ వాళ్లకి ఉంటుంది.. ఇండస్ట్రీలో ఎవరు ఉండాలి.. ఎవరు ఉండకూడదనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు అని అన్నారు. ఒక్కోసారి…

TFN Adminవాట్సాప్
Actress Rakul Preet Singh Hits 15 Million Follower Mark On Instagram
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ లో 15 మిలియన్ ఫాలోవర్స్

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. హీరోయిన్ రకుల్ ప్రస్తుతం "ఎటాక్ ", "ఛలే ఛలో"(హిందీ ), "అయిలాన్ ", "ఇండియన్ 2"(తమిళ ), ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు రకుల్ ఇన్ స్టా గ్రామ్ లో 15 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గోల్ఫ్ క్లబ్ లో రకుల్ ప్రీత్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మోడలింగ్ , యాక్టింగ్ ప్రొఫెషన్స్ లో రావడానికి ముందు రకుల్ గోల్ఫ్ గేమ్ లో నేషనల్ లెవెల్ ప్లేయర్ గా రాణించారు. లాక్ డౌన్ కారణం గా కొన్ని నెలలుగా ఇంటికే పరిమితం అయిన రకుల్ వర్కౌట్స్ , ఫుడ్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న రకుల్ కరోనా వ్యాప్తి నివారణ కై అభిమానులలో చైతన్యం నింపుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ ఆఫర్స్ అంత ఈజీ కాదు - రకుల్ ప్రీత్

దక్షిణాది భాషల సినిమాలలో స్టార్ డమ్ పొందిన హీరోయిన్స్ తమ గోల్ గా బాలీవుడ్ ను ఎంచుకొంటారని తెలిసిన విషయమే. బాలీవుడ్ లో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ వస్తుంది. అందుకే సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ మూవీస్ పై ఆసక్తి చూపుతారు. అయితే బాలీవుడ్ లో ఆఫర్స్ అంత ఈజీ కాదని రకుల్ చెప్పారు. రకుల్ మాట్లాడుతూ .. దక్షిణాది భాషలలో స్టార్ డమ్ ఉన్నప్పటికీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పట్టించుకోదని , బాలీవుడ్ లో సక్సెస్ కావాలంటే కెరీర్ మొదటి మెట్టునుండీ ప్రారంభించాల్సిందే నని , మూవీస్ సక్సెస్ ను బట్టి స్టార్ డమ్ వస్తుందని చెప్పారు.

Team TFNవాట్సాప్

షేర్