రకుల్-మంచు లక్ష్మీ.. సరదాగా సైక్లింగ్

Actress Rakul Preet Singh And Manchu Lakshmi Goes For Bicycle Outing In The Rain

టాలీవుడ్ లో రకుల్-మంచు లక్ష్మీ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కూడా అప్పుడప్పుడు కలుస్తూ సరదాగా కాలక్షేపం చేస్తూనే ఉన్నారు. ఇక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఎప్పుడూ తన సోషల్‌మీడియా అకౌంట్లలలో షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరో వీడియోను షేర్‌ చేసింది. రకుల్- మంచు లక్ష్మీ సరదాగా సైక్లింగ్ కు వెళ్లినట్టు తెలుస్తుంది ఆ వీడియోను చూస్తుంటే. వీడియోతో పాటు కొన్ని ఫోటోలను కూడా రకుల్‌ షేర్‌ చేసింది. ప్ర‌ముఖ సైక్లిస్ట్ ఆదిత్యా మెహ‌తాతో క‌లిసి ర‌కుల్ ప్రీత్ సింగ్, ల‌క్ష్మి మంచు హైద‌రాబాద్ రోడ్ల‌పై సైక్లింగ్ చేశారు. సుమారు 30 కిలోమీట‌ర్లు చ‌క్క‌ర్లు కొట్టార‌ట‌. వీరితో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ ప్రీత్ సింగ్ కూడా సైక్లింగ్ లో పాల్గొన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా గత ఏడాది తెలుగులో మన్మధుడు2, హిందీలో ‘దే దే ప్యార్ దే’ సినిమా తో సందడి చేయగా.. ఈ ఏడాది ఒక అరడజను సినిమాలను లైన్ లో పెట్టింది రకుల్. అందులో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమా కూడా ఒకటి. తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది రకుల్. హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. రీసెంట్ గా క్రిష్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =