ట్యాగ్ · 450 కథనాలు

గాయాలు కాదు తీపి గుర్తులు..!

సుధీర్ వర్మ దర్శకత్వంలో నాని ?

డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ?
విజయ్ బాటలో సందీప్ వంగా..!

`భీష్మ`... రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?

మ్యూజికల్ హిట్ ‘గుడుంబా శంకర్’కి 15 ఏళ్ళు

రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్
‘కేజీఎఫ్’ డైరెక్టర్‌తో మహేష్?

సామాజిక కథాంశంతో సాయి తేజ్, దేవ కట్టా సినిమా
మరో థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్

కాంబినేషన్ రిపీట్...?

గోపీచంద్ 'చాణక్య' టీజర్ రిలీజ్

వాల్మీకి మూవీ ట్రైలర్ రిలీజ్

చైతు - సాయి పల్లవి సినిమా షూటింగ్ ప్రారంభం

మీడియా సమావేశంలో నాని స్పందన

ఇంతకంటే ఎక్కువ ఊహించగలరా..!
మాతృక అయినా.. రీమేక్ అయినా ఫైనల్ రిజల్ట్ ప్రేక్షకులదే..!
సినిమా తీసే దర్శకనిర్మాతలు కానీ.. హీరో హీరోయిన్లు కానీ తమ సినిమా మంచిగా ఆడాలి.. మంచి కలెక్షన్స్ రావాలి.. సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరూ బావుండాలనే ఉద్దేశంతోనే సినిమాలు తీస్తుంటారు. కానీ అన్నిసార్లు కలిసిరావు కదా.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడితే మరికొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. ఇక ఒకప్పటి సినిమా ప్రపంచానికి..ఇప్పటి సినిమా ప్రపంచానికి చాలా తేడా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎంతో మంది కొత్త కొత్త వాళ్ళు ఇండస్ట్రీ కి పరిచయమవుతున్నారు. లక్ కలిసొచ్చిందా ఒక్క సినిమాతో ఓవర్ నైట్ తో స్టార్ ఐపోతున్నారు. అంతే కాదు ఈ మధ్య రీమేక్ ల సందడి కూడా ఎక్కువైంది. ఒక భాషలో హిట్ అయిన…
క్రేజీ గా గ్యాంగ్ లీడర్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్ లీడర్. ఇంకా మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇంకా స్పీడ్ పెంచారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించారు. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా క్రేజీ గా జరిగినట్టు తెలుస్తుంది.

గాయాలు కాదు తీపి గుర్తులు..!
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని హీరో గా 'వి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా మరో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో భాగంగా తన చేతికి అయిన గాయాల్ని తలుచుకుంటూ.. ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ స్వీట్ మెమోరీస్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు..

సుధీర్ వర్మ దర్శకత్వంలో నాని ?
హీరో నాని కథానాయకుడిగా విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ NANI'S గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆ మూవీ ప్రమోషన్స్ లో నాని బిజీగా ఉన్నారు. నాని ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్ర గంటి దర్శకత్వం లో రూపొందుతున్న V మూవీ లో నటిస్తున్నారు. అష్టా చమ్మా వంటి సూపర్ హిట్ మూవీ తో తనను హీరో గా టాలీవుడ్ కు పరిచయం చేసిన ఇంద్రగంటి దర్శకత్వంలో నాని తన 25 వ మూవీ లో నటించడం విశేషం. V మూవీ 2020 సంవత్సరంలో రిలీజ్ కానుంది.

డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘ఫైటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒక డాన్‌కి, అతని కొడుకుకి మధ్య సాగే కథే ఈ చిత్రమని తెలిసింది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో... ఓ సీనియర్ హీరో డాన్‌గా కనిపించనుండగా... అతని కొడుకుగా విజయ్ నటించనున్నాడని సమాచారం. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్... ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. అలాగే... 2020 సమ్మర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు…

'ప్రతిరోజూ పండగే' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
వరుస ప్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు సాయి తేజ్. చాలా కథలు విన్న తర్వాత మారుతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రతిరోజూ పండగే అన్న టైటిల్ తో ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తి చేసుకోగా క్రిస్మస్ పండుగా నేపథ్యంలో డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
విజయ్ బాటలో సందీప్ వంగా..!
అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ సందీప్ వంగా, హీరో విజయ్ దేవరకొండ ఇద్దరి రేంజ్ మారిపోయింది అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ అయితే ఆ సినిమా తర్వాత టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. క్రాంతి మాధవన్ తో ఒక సినిమా, పూరీ జగన్నాధ్ తో మరొక సినిమా, ఆనంద్ అన్నామలై హీరో సినిమా.. ఇంకా నాగ్ అశ్విన్ తో మరో సినిమా ఇలా వరుసగా సినిమాలు క్యూలో పెట్టాడు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తన సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నిర్మాతగా సినిమా చేస్తున్నాడు..

`భీష్మ`... రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?
యువ కథానాయకుడు నితిన్, ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘భీష్మ’. సింగల్ ఫరెవర్ అన్నది ఉప శీర్షిక. నితిన్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో... నితిన్, ‘వెన్నెల’ కిషోర్ మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ను... సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

మ్యూజికల్ హిట్ ‘గుడుంబా శంకర్’కి 15 ఏళ్ళు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘గుడుంబా శంకర్’ ఒకటి. వీరశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ను... అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పవన్ సోదరుడు కె.నాగబాబు నిర్మించారు. పవన్‌కి జోడిగా మీరా జాస్మిన్ నటించగా... ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, అలీ, సునీల్, వేణుమాధవ్, షాయాజీ షిండే, కోట శ్రీనివాసరావు, భువనేశ్వరి, కవిత, జ్యోతి, రాజన్ పి.దేవ్, నతన్యా సింగ్ (ప్రత్యేక గీతం) తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్
KK రాధామోహన్ నిర్మాణ సారథ్యంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా, గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందనున్న మూవీ కి ఒరేయ్ .. బుజ్జిగా టైటిల్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. షాలిని పాండే హీరోయిన్ కాగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తారు. ఐదు సంవత్సరాల తరువాత దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఒరేయ్ .. బుజ్జిగా మూవీ కి దర్శకత్వం వహించడం విశేషం.
‘కేజీఎఫ్’ డైరెక్టర్‌తో మహేష్?
‘కేజీఎఫ్’... ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం... ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ 2’ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు ప్రశాంత్. ఇదిలా ఉంటే... ‘కేజీఎఫ్’తో ఆకట్టుకున్న ప్రశాంత్‌తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ యన్టీఆర్ ఓ డ్యాన్స్ బేస్డ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ యాక్షన్ డ్రామా చేయడానికి పచ్చ జెండా ఊపినట్లు తెలిసింది.

సామాజిక కథాంశంతో సాయి తేజ్, దేవ కట్టా సినిమా
‘ప్రస్థానం’ (2010)తో ఆకట్టుకున్న దర్శకుడు దేవ కట్టా. ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. కట్ చేస్తే... తాజాగా అదే చిత్రాన్ని హిందీలోనూ 'ప్రస్థానం' పేరుతోనే రీమేక్ చేసాడు దేవ. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ డ్రామా ఈ నెల(సెప్టెంబర్) 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్
సినిమా హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు యాంగ్రీ హీరో రాజశేఖర్. ఇటీవలే సస్పెన్స్ థ్రిల్లర్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ శేఖర్.. ఎప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో రాబోతున్నాడు. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి. ధనుంజయన్ నిర్మాణంలో రాజశేఖర్ ఓ సినిమాకు కమిటయినట్టు గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు డైరెక్టర్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి…

కాంబినేషన్ రిపీట్...?
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఎవడే సుబ్రమణ్యం సినిమా తో టాలీవుడ్ లో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడట. అందుకే ఈ సినిమాకు 'ఫైటర్' అనే టైటిల్ ను పెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గోపీచంద్ 'చాణక్య' టీజర్ రిలీజ్
తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో 'చాణక్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

వాల్మీకి మూవీ ట్రైలర్ రిలీజ్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ వాల్మీకి మూవీ సెప్టెంబర్ 20వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ మూవీ లో పూజ హెగ్డే కథానాయిక. తమిళ హీరో అథర్వ మురళి ఒక ముఖ్య పాత్రలో నటించారు. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు. సూపర్ హిట్ తమిళ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్ గా వాల్మీకి రూపొందింది.

కార్తికేయ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో కార్తికేయ. తర్వాత వచ్చిన హిప్పీ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన కార్తికేయ 'గుణ 369' సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇదిలా ఉండగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా మరో సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కార్తికేయ సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను కూడా 'ఆర్ ఎక్స్100' సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

చైతు - సాయి పల్లవి సినిమా షూటింగ్ ప్రారంభం
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో జరుపుకుంది ఈ సినిమా. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించారు చిత్ర యూనిట్. హైదరాబాద్ లో ఈ రోజు షూటింగ్ ను ప్రారంభించారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నాడు.

మీడియా సమావేశంలో నాని స్పందన
విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన NANI'S గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13 తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆ మూవీ ప్రమోషన్స్ లో మీడియా కు ఇంటర్వ్యూస్ ఇస్తూ హీరో నాని బిజీగా ఉన్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు ఎలా రెస్పాండ్ కావాలోతెలియడం లేదని నాని అన్నారు.

ఇంతకంటే ఎక్కువ ఊహించగలరా..!
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా సాహో. ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్స్ కు మాత్రం ఏమాత్రం ఢోకా లేదు. ఈ సినిమా ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 80 కోట్ల షేర్ ను సాధించింది.