సినిమా తీసే దర్శకనిర్మాతలు కానీ.. హీరో హీరోయిన్లు కానీ తమ సినిమా మంచిగా ఆడాలి.. మంచి కలెక్షన్స్ రావాలి.. సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరూ బావుండాలనే ఉద్దేశంతోనే సినిమాలు తీస్తుంటారు. కానీ అన్నిసార్లు కలిసిరావు కదా.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడితే మరికొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. ఇక ఒకప్పటి సినిమా ప్రపంచానికి..ఇప్పటి సినిమా ప్రపంచానికి చాలా తేడా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎంతో మంది కొత్త కొత్త వాళ్ళు ఇండస్ట్రీ కి పరిచయమవుతున్నారు. లక్ కలిసొచ్చిందా ఒక్క సినిమాతో ఓవర్ నైట్ తో స్టార్ ఐపోతున్నారు. అంతే కాదు ఈ మధ్య రీమేక్ ల సందడి కూడా ఎక్కువైంది. ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ రీమేక్ పద్ధతి ఒకప్పుడు కూడా ఉండేది కానీ.. ఇప్పుడున్నంత లెవెల్ లో ఉండేది కాదు. ఇప్పుడు ఏదైన సినిమా రిలీజ్ అయి హిట్ అయితే చాలు వెంటనే రైట్స్ కొనేస్తున్నారు.. రీమేక్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉందండోయ్.. రైట్స్ కొనేసి రీమేక్ చేసినంత మాత్రానా సినిమా హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. మాతృకలో హిట్ అయింది కదా అని ఆశపడి నిర్మాతలు రైట్స్ కొంటే మాతృకలో హిట్ అయిన సినిమా.. రీమేక్ లో ఫట్ అవ్వొచ్చు. కొన్ని సినిమాలు మాతృకలో ఆడకపోవచ్చు.. కొన్ని ఆడొచ్చు.. ఫైనల్ గా రిజల్ట్ మాత్రం ప్రేక్షకుల మీదనే ఆధారపడి ఉంటుంది. అలా మాతృకలో హిట్ అయిన సినిమాల్లో కొన్ని సినిమాలు ఇక్కడ హిట్ అయ్యాయి.. కొన్ని సినిమాలు ప్లాప్స్ కూడా అయ్యాయి. మరి ఆ సినిమాల లిస్ట్.. సినిమాల ఆన్ లైన్ సోర్స్ ఎక్కడుందో కింద తెలుపబడ్డాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1. రాచ్చసన్ (తమిళ్) – రాక్షసుడు
రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రాక్షసుడు’ మంచి టాక్ ను సంపాదించుకుంది. ఇన్ని రోజులు స్టార్ హీరో స్థాయిలో వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన ఇప్పుడు చిన్న సినిమాతో వచ్చాడు. బిల్డప్ కాకుండా కథ ఎక్కువగా ఉండేలా చూసుకుని రాక్షసుడు సినిమా చేసాడు. ఈ చిత్రం తమిళనాట హిట్ అయిన రాచ్చసన్ సినిమాకు రీమేక్. ఇక సినిమాతోనే సాయి శ్రీనివాస్ కు ఎప్పటినుండో ఎదురుస్తున్న హిట్ దక్కింది. ఇక తమిళ్ వెర్షన్ ‘Sun Nxt‘ లో అందుబాటులో ఉండగా.. తెలుగు వెర్షన్ ఇంకా రావాల్సి ఉంది.
2. దృశ్యం (మలయాళం) – దృశ్యం
ఇక మలయాళం లో హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేశారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ మీనా, కృతిక, బేబీ ఎస్తర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక మలయాళం లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా.. ఇక్కడ కూడా మంచి టాక్ నే సంపాదించుకుంది. ఇక మలయాళం వెర్షన్ ‘Hotstar‘ లో తెలుగు వెర్షన్ ‘Sun Nxt‘ లో అందుబాటులో ఉంది.
3. గోలీసోడా (తమిళ్) – ఎవడు తక్కువ కాదు
తమిళ్ లో హిట్ అయిన “గోలిసోడా” సినిమా ని తెలుగులో ‘ఎవడు తక్కువ కాదు’ అనే టైటిల్ తో రీమేక్ చేసారు. బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అనేది ట్యాగ్ లైన్. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. అయితే తమిళ్ లో హిట్ అయింతగా ఇక్కడ ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పొచ్చు. అందుకే అక్కడ హిట్ అయిన సినిమా ఇక్కడ ఫట్ అయింది. ఇక గోలీసోడా సినిమా ‘Zee 5‘ అందుబాటులో ఉండగా..’ఎవడు తక్కువ కాదు’ సినిమా ‘Prime Video‘లో అందుబాటులో ఉంచారు.
4. ఇరుద్ది సుట్రు (తమిళ్) – గురు
సుధా కొంగర దర్శకత్వంలో హిందీలో ‘సాలా ఖండూస్’ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆ తర్వాత తమిళంలో ‘ఇరుద్ది సుట్రు’ గా రీమేకై ఘన విజయం సొంతం చేసుకుని.. తెలుగులో కూడా ఆమె దర్శకత్వంలోనే విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో రీమేక్ అయి ఇక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది. సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో.. యాంగ్రీ బాక్సింగ్ కోచ్ గా వెంకీ తన పాత్రలో జీవించారనే చెప్పొచ్చు. అదే ఈ సినిమాకు హైలైట్ గా నిలిచి సినిమా సక్సెస్ కు కారణమైంది. ఇక ‘ఇరుద్ది సుట్రు’ ‘YouTube‘ లో అందుబాటులో ఉండగా.. ‘గురు’ సినిమా ‘Sun Nxt‘ లో అందుబాటులో ఉంది.
5. ఖుషి (తమిళ్) – ఖుషి
ఎస్.జె సూర్య దర్శకత్వంలో విజయ్, జ్యోతిక హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన ఖుషి సినిమాను.. తెలుగులో కూడా మాతృకకు దర్శకత్వం వహించిన ఎస్.జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, భూమిక ప్రధాన పాత్రలలో రీమేక్ చేశారు. అక్కడ ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో.. ఇక్కడ కూడా అంతే సూపర్ హిట్ అయింది. ఇక ఆ సినిమాతో పవన్ కు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మణిశర్మ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మరో హైలైట్. ఇక తమిళ్ వెర్షన్ (Prime Video), తెలుగు వెర్షన్ కూడా (Prime Video) లో అందుబాటులో ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి.
6. కత్తి (తమిళ్) – ఖైదీ నెం. 150
మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన కత్తి తమిళ మూవీ 2014 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక కత్తి మూవీ తెలుగు రీమేక్ ఖైదీ నెం 150. వి.వి వినాయక్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతమైంది. ఇక తమిళ్ లో, తెలుగులో రెండు భాషల్లోనూ హిట్ అయిన ఈ సినిమాలు ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంది. ఇదిలా ఉండగా తమిళ్ కత్తి ‘Netflix‘ లో అందుబాటులో ఉండగా..రీమేక్ ఖైదీ నెం. 150 ‘Hotstar‘ లో అందుబాటులో ఉంది.
7. వీరం (తమిళ్) – కాటమరాయుడు
శివ దర్శకత్వంలో అజిత్, తమన్నా హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన ‘వీరం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద.. ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాను తెలుగులో ‘కాటమరాయుడు’ గ రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కాస్త నిరాశపరిచిందనే చెప్పొచ్చు. పవన్ హీరో ఆయనా కూడా సినిమాకు యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. ఇక ‘వీరం’ సినిమా ‘Voot‘ లో అందుబాటులో ఉండగా.. ‘కాటమరాయుడు’ ‘Sun Nxt‘ లో అందుబాటులో ఉంది.
8. బిల్లా (తమిళ్) – బిల్లా
తమిళంలో అజిత్, నయనతార, నమితలు నటించిన యాక్షన్ థ్రిల్లర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “బిల్లా” సినిమా తెలుగులో కూడా రీమేక్ అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ప్రభాస్, అనుష్క హీరోహీరోయిన్లుగా గోపీకృష్ణ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇక ఈసినిమా ప్రభాస్ సినీ కెరీర్ లోనే ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా బిల్లా తమిళ్ వెర్షన్ ‘Hungama‘ లో అందుబాటులో ఉండగా… తెలుగు వెర్షన్ ‘Sun Nxt‘ లో అందుబాటులో ఉంచారు.
9. సతురంగా వెట్టయ్ (తమిళ్) – బ్లఫ్ మాస్టర్
2014లో తమిళ్ లో రిలీజ్ ఆయిన సతురంగా వెట్టయ్ తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. సత్య దేవ్ హీరో గా గోపి గణేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అక్కడ హిట్ అయింది కానీ.. ఇక్కడ మాత్రం అంతగా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక సతురంగా వెట్టయ్ ‘Hotstar‘ లో అందుబాటులో ఉంచగా.. బ్లఫ్ మాస్టర్ ‘Prime Video‘ లో అందుబాటులో ఉంది.
10. జెమిని (తమిళ్) – జెమిని
శరన్ దర్శకత్వంలో విక్రమ్, కిరణ్ రాథోడ్ హీరో హీరోయిన్లు గా 2002 లో తెరకెక్కిన సినిమా ‘జెమిని’. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయింది. ఇదే సినిమాను వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా ఇక్కడ అంత నచ్చలేదనే చెప్పాలి. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఎక్కడ మాత్రం ఫట్ అయింది. ఇక జెమిని తమిళ్ వెర్షన్ (Prime Video), తెలుగు వెర్షన్ రెండూ (Prime Video) లో అందుబాటులో ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి.
11. నట్టమై (తమిళ్) – పెదరాయుడు
1994 తమిళ్ లో వచ్చిన నట్టమై సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదే సినిమాను తెలుగులో ‘పెదరాయుడుగా’ రీమేక్ చేశారు. మోహాన్ బాబు, సౌందర్య, రజనీకాంత్, భానుప్రియ లీడ్ రోల్స్ లో రవిరాజా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. రీమేక్ రైట్స్ ను కొన్న మోహన్ బాబుకు ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆ రోజుల్లో పెదరాయుడు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతే కాదు ఉత్తమ నటుడిగా మోహన్ బాబు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఇక నట్టమై ‘Sun Nxt‘ లో పెదరాయుడు ‘Prime Video‘ లో అందుబాటులో ఉన్నాయి.
12. సుందర్ పాండ్యన్ (తమిళ్) – స్పీడున్నోడు
శశి కుమార్ ప్రధాన పాత్రలో తమిళ్ లో తెరకెక్కిన సుందరపాండ్యన్ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఈ క్రైమ్ కామెడీ తమిళ నాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇక ఈ సినిమాను ఇక్కడ తెలుగులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా మాత్రం ఇక్కడ బోల్తా కొట్టింది. రీమేక్ కథలు ఎంచుకొని హిట్ కొట్టడం ఎలాగో, భీమినేని శ్రీనివాస్ బాగా తెలుసు. ఆయన సినిమాల్లో దాదాపు అన్నీ రీమేక్‌లే. కానీ ఎంతో నమ్మకంతో ఆయన ఈ సినిమా చేసినా ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక సుందర్ పాండ్యన్ సినిమా ‘Sun Nxt‘ లో అందుబాటులో ఉండగా స్పీడున్నోడు సినిమా ‘Prime Video‘ లో అందుబాటులో ఉంది.
13. రమణ (తమిళ్) – ఠాగూర్
ఏ. ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయకాంత్, సిమ్రాన్ మరియు అషిమా బల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా రమణ. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక అదే సినిమాను ‘ఠాగూర్’ అనే పేరుతో చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయితే అవ్వలేదు కానీ.. యావరేజ్ టాక్ ను మాత్రం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ‘Sun Nxt‘ అందుబాటులో ఉండగా.. ఠాగూర్ సినిమా ‘Zee5‘ అందుబాటులో ఉంది.
14. ధూల్ (తమిళ్) – వీడే
2003 లో ధరణి దర్శకత్వంలో విక్రమ్, జ్యోతిక మరియు రీమా సేన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ధూల్. ఇదే సినిమాను వీడే అనే టైటిల్ తో రీమేక్ చేశారు. రవిరాజాపినిశెట్టి దర్సకత్వంలో యాక్షన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవి తేజ, ఆర్తి అగర్వల్, రీమ సేన్ నటించారు. అయితే ఈ సినిమా తమిళ్ లో బాగా ఆడింది కానీ… తెలుగులో మాత్రం ప్లాప్ అయింది. ఇక ధూల్ మూవీ ‘Googleplay‘ వీడే మూవీ ‘Sun Nxt‘ లో అందుబాటులో ఉంది.
15. అదే కంగల్ (తమిళ్) – నీవెవరో
తమిళంలో విజయవంతమైన ‘అదే కంగల్’`కి రీమేక్ ‘నీవెవరో’. క్రైమ్ థ్రిల్లర్‌గా హరినాథ్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి, తాప్సి, రితిక సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇక్కడ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అందుకే తమిళ్ లో హిట్ అయిన ఈ సినిమా ఇక్కడ మాత్రం ప్లాప్ అయింది. ఇక అదే కంగల్ ‘Prime Video‘ లో సినిమా నీవెవరో సినిమా ‘Netflix‘ అందుబాటులో ఉన్నాయి.
16. మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్ (హిందీ) – శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
సంజయ్ దత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్. ఇక ఇదే సినిమాను శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ గా జయంత్ సి. పరాంజీ రీమేక్ చేసాడు. ఇందులో చిరంజీవి, సోనాలీ బెంద్రే ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీలో హిట్ అయినట్టే.. తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. ఇదిలా ఉండగా మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్ ‘Sony Liv‘ లో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ ‘Hungama‘ లో అందుబాటులో ఉన్నాయి.
17. లవ్ ఆజ్ కల్ ( హిందీ) – తీన్ మార్
దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 2009లో ‘లవ్ ఆజ్ కల్’ అనే సినిమా వచ్చింది. పవన్ కళ్యాణ్, త్రిష కాంబినేషన్ లో రూపొందిన ‘తీన్ మార్’చిత్రం హిందీ చిత్రం ‘లవ్ ఆజ్ కల్’కి రీమేక్. ఇక హిందీలో యావరేజ్ గా ఆడిన ఈ సినిమా తెలుగులో కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఇక లవ్ ఆజ్ కల్ సినిమా ‘Eros Now‘ అందుబాటులో ఉండగా.. తీన్ మార్ ‘Hungama‘ లో అందుబాటులో ఉంది.
18. ఓ మై గాడ్ (హిందీ) – గోపాల గోపాల
పరేష్ రావల్, మిథున్ చక్రవర్తి, అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన హిందీ సినిమా ఓ మై గాడ్ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ క్లాజ్ అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో దొంగ స్వాములు, మూఢ నమ్మకాలపై ఎక్కుపెట్టిన ప్రశ్నలు కొన్ని ఆలోచనలో పడేసే దిసగా ప్రయత్నించారు. ఇక ఇదే సినిమాను తెలుగులో గోపాల గోపాల పేరుతో రీమేక్ చేశారు. కిశోర్‌కుమార్ పార్థసాని దర్శకత్వంలో వెంకటేష్, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా హిందీ లో హిట్ అయినంతగా హిట్ అవ్వలేదు. యావరేజ్ హిట్ దక్కించుకుంది. ఓ మై గాడ్ సినిమా ‘Netflix‘ లో అందుబాటులో ఉండగా… గోపాల గోపాల ‘Sony Liv‘ లో అందుబాటులో ఉండి.
19. హరిహర్ నగర్ (మలయాళం) – మధుర నగరిలో
కోడిరామకృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్, నిరోషా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మధుర నగరిలో.మంచి కామెడీ ఎంటర్టైనర్ గా లాల్ సిద్దికీ దర్సకత్వం లో మలయాళంలో తెరకెక్కిన హరిహర్ నగర్ సినిమాకు రీమేకే మధుర నగరిలో. ఇక మలయాళం లో హరిహర్ నగర్ ఎంత హిట్ అయిందో.. ‘మధుర నగరిలో’ సినిమా కూడా అంతే హిట్ అయింది తెలుగులో. ఇక ఈ సినిమాలు కూడా ఆన్లైన్ సైట్స్ లో అందుబాటులో ఉన్నాయి. హరిహర్ నగర్ ‘Hotstar‘ లో మధుర నగరిలో ‘Sony Liv‘ లో అందుబాటులో ఉంది.
20. చంద్రలేఖ (మలయాళం) – చంద్రలేఖ
మలయాళంలో చంద్రలేఖ సినిమానే తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేశారు. ఫ్యామిలీ కామిడి ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున, రమ్య క్రిష్ణా, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక అక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమా.. ఇక్కడ మాత్రం యావరేజ్ హిట్ ను దక్కించుకుంది. ఇక చంద్రలేఖ మలయాళం… తెలుగు వెర్షన్స్ రెండూ ‘Hotstar’ లో అందుబాటులో ఉంచారు. మలయాళం వెర్షన్ (Hotstar).. తెలుగు వెర్షన్ (Hotstar)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: