ఓజీలో నేహా శెట్టి కూడా
గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. ఇందులో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.ఇక ఈసినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించనుంది అయితే సెకండ్ హీరోయిన్ గా కాకుండా స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.ఇంతకీ తను ఎవరంటే కన్నడ బ్యూటీ ,డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి.ఓజీ లో స్పెషల్ సాంగ్ చేసానని ఈవిషయాన్ని స్వయంగా తనే ఓ ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించింది.
పూర్తి వార్త చదవండి


















