ఓజీ నుండి ఫస్ట్ సాంగ్ రానుంది

Get Ready for the First Song from OG

పవన్ కళ్యాణ్ ఓజీ ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సాంగ్ కంపోజ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా వుంది. కానీ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు మేకర్స్. ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడనుంది.ఫస్ట్ సింగిల్ వచ్చే వారం లో రానుంది.అందుకు సంబంధించి హింట్ కూడా ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.ఈ సాంగ్ ను తమిళ హీరో శింబు పాడడం విశేషం.మరి సాంగ్ వచ్చాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్ గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.రీసెంట్ గానే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కావడం దాదాపు ఖాయం.ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓజీ పవన్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.

ఇక పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొనుంటున్నాడు.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో లో వేసిన సెట్ లో పాట చిత్రీకరణ జరుగుతుంది.ఈ షెడ్యూల్ తో పవన్ పాత్ర తాలూకు షూటింగ్ కంప్లీట్ కానుంది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.