మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ నెక్స్ట్ మాస్ జాతరతో రానున్నాడు.రవితేజ కు ఇది 75వ సినిమా కావడం విశేషం.షూటింగ్ కూడా పూర్తిచేసుకున్న ఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈరోజు సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఓలే ఓలే అంటూ వచ్చే సాగే ఈసాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయ్యేలా వుంది మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ట్యూన్స్ కి రవితేజ ,శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ థియేటర్స్ ను షేక్ చేయనుంది.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ధమాకా ఆడియో పరంగా కూడా ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఇక పీక్ ఫామ్ లో వున్న భీమ్స్ ఇప్పుడు మాస్ జాతర కికూడా అలాంటి ఆల్బమ్ నే రెడీ చేస్తున్నాడు. రేపు సాయంత్రం 4:06 గంటలకు ఫుల్ సాంగ్ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భాను భోగవరపు ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ముందు చెప్పిన తేదీ ప్రకారం ఆగస్టు 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇక రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తన 76వ సినిమాలో నటిస్తున్నాడు.తొందరగానే ఈసినిమాను కంప్లీట్ చేయనున్నాడు రవితేజ.ఈసినిమాకి కూడా భీమ్స్ సిసిరోలియోనే సంగీతం అందిస్తుండగా చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























