మాస్ జాతర.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న ‘ఓలే ఓలే’ సాంగ్

Mass Jathara Ole Ole Song Crosses 1 Million Plus Views on YouTube

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్‌ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్. రవితేజకు ఇది 75వ చిత్రం కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఓలే ఓలే’ అంటూ సాగే ఈ సాంగ్‌ ఒక్కరోజు గడవకముందే ఒక మిలియన్‌కి పైగా వ్యూస్‌‌‌‌‌‌‌‌తో యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌ సిసిరోలియో అదిరిపోయే బీట్స్‌ ఇవ్వగా.. రవితేజ, శ్రీలీల ఫుల్ ఎనర్జీతో వేసిన స్టెప్స్ పాటను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. యూత్‌కి బాగా కనెక్ట్ అవడంతో ‘ఓలే ఓలే’ సాంగ్‌ ఇన్స్టంట్ హిట్ అయిపోయింది. ఈ మాస్ సాంగ్‌కి భాస్కర్ యాదవ్ లిరిక్స్ అందించగా.. రోహిణి, భీమ్స్ హై పిచ్‌తో ఆలపించారు.

ఇక మాస్ జాతరలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

రవితేజ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ రావడం, అలాగే ఆ తర్వాత విడుదల చేసిన రెండు పాటలు చార్ట్ బస్టర్ కావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే ఇటీవల రవితేజ నటించిన సినిమాలేవీ సరిగా ఆడటంలేదు. ఈ తరుణంలో తనకి సరిగ్గా సరిపోయే మాస్ అండ్ పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా రూపొందడంతో ఈసారి గట్టిగా కొడతాడు అని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలోకి సోలోగా రానుండటం కూడా కలిసిరానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.