నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి రెండవ సింగిల్ ‘ఏం జరుగుతోంది’ రేపు, ఆగస్టు 26న విడుదల కానుంది. ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి సింగిల్ ‘నదివే…’ మంచి స్పందన పొందింది. ఇప్పుడు రెండవ పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఏం జరుగుతోంది’ పాట ఒక మెలోడీ ఫీల్-గుడ్ లవ్ సాంగ్ అని చిత్ర బృందం తెలిపింది. ప్రేమలో జరిగే ప్రతి అనుభవాన్ని, ప్రతి క్షణాన్ని ఈ పాట చాలా అందంగా చూపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను చిన్మయి శ్రీపాద, హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతంగా ఆలపించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక సరసన ‘దసరా’ ఫేమ్ నటుడు దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు.
ఈ పాట విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఒక మంచి మెలోడీ లవ్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ పాట ఒక గొప్ప విందు లాంటిది. రేపు విడుదల కానున్న ‘ఏం జరుగుతోంది’ పాట సినిమాకు ఎలాంటి హైప్ తీసుకువస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























