‘క’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తోన్న సినిమా ‘కె ర్యాంప్’. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు జైన్స్ నాని డైరెక్షన్ చేస్తున్నాడు. కొన్ని రోజులక్రితం, గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్గా గ్లింప్స్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. దీనిలో భాగంగా నేడు ఫస్ట్ సింగిల్ ‘ఓనం’ పాటను రిలీజ్ చేశారు. కేరళ ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగైన ‘ఓనం’ నేపథ్యంలో రూపొందిన ఈ ట్రెడిషనల్ సాంగ్‌కి చైతన్ భరద్వాజ్ ఆకట్టుకునే సంగీతం అందించాడు. ఫుల్ కలర్ ఫుల్‌గా ఉన్న ఈ సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుంది.
కాగా ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం ఫుట్ బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. నాగశౌర్య ‘రంగబలి’తో టాలీవుడ్ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ యుక్తి థరేజా కిరణ్ సరసన కథానాయికగా నటిస్తోంది. ‘సామజవరగమన’ నిర్మాత రాకేష్ దండా ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 18న కె ర్యాంప్ థియేటర్లోకి రానుంది.
ఇక ఇదిలావుంటే, మరోవైపు కిరణ్ ఈ సినిమాతో పాటుగా ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే మూవీ కూడా చేస్తున్నాడు. నంబూరి రవి దర్శకత్వంలో ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటిస్తోంది. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ‘బేబి’ డైరెక్టర్ సాయి రాజేష్ నిర్మిస్తున్నాడు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























