బాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘వార్ 2’. ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. కియారా అద్వానీ హీరోయిన్గా, సీనియర్ నటుడు అశుతోష్ రాణా మరో ముఖ్య పాత్రలో కనిపించారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఈ క్రమంలో తాజాగా వార్ 2 నుంచి అదిరిపోయే అప్డేట్ను అందించింది. దీనిలో భాగంగా ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేసిన ‘దునియా సలామ్ అనాలి’ అనే పాట ప్రోమోను రిలీజ్ చేసింది. స్వతహాగా బెస్ట్ డ్యాన్సర్స్ అయిన ఇద్దరు స్టార్ హీరోలు ఇందులో పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. హృతిక్, తారక్ ఇద్దరూ చాలా ఈజ్‌తో చేశారు. చూస్తుంటే, ఈ పాట వచ్చినప్పుడు రేపు థియేటర్లలో అభిమానులకు పూనకాలే అన్నట్టుగా ఉంది.
ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకి ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ప్రీతమ్ పాటలకి, అలాగే సంచిత్ బల్హర మరియు అంకిత్ బల్హార సంయుక్తంగా నేపథ్య సంగీతం సమకూర్చారు. అలాగే బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























