ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ రివ్యూ

A1 Express Movie Review,Latest Telugu Movie Reviews,Latest Telugu Movies News,Latest Tollywood News,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,A1 Express,A1 Express Movie,A1 Express Movie Public Response,A1 Express Movie Public Talk,A1 Express Movie Public Talk And Public Response,A1 Express Movie Review And Rating,A1 Express Movie Updates,A1 Express Public Response,A1 Express Public Talk,A1 Express Public Talk And Public Response,A1 Express Review,A1 Express Review And Rating,A1 Express Telugu Movie,A1 Express Telugu Movie Latest News,A1 Express Telugu Movie Public Response,A1 Express Telugu Movie Public Talk,A1 Express Telugu Movie Public Talk And Public Response,A1 Express Telugu Movie Review,A1 Express Telugu Movie Review And Rating,Sundeep Kishan A1 Express Telugu Movie Review,Sundeep Kishan A1 Express Movie Review

డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాకీ నేపథ్యంలో వస్తున్న మొట్ట మొదటి సినిమా కావడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమా కూడా మార్చి 5 న రిలీజ్ అవుతుంది. ఈసినిమా మంచి హిట్ అవుతుందని సందీప్ కిషన్ కూడా నమ్మకంతో ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ నేమ్ : ఏ1 ఎక్స్ ప్రెస్ (తెలుగు )
మూవీ డీటెయిల్స్ :
మూవీ – ఏ1 ఎక్స్ ప్రెస్
ఏ1 ఎక్స్ ప్రెస్ క్రూ – సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి
ప్రొడ్యూసర్స్ – టి. జి. విశ్వ ప్రసాద్ ,అభిషేక్ అగర్వాల్ ,సందీప్ కిషన్, దయ పన్నెం
కో – ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల
డైరెక్టర్ – డెన్నిస్ జీవన్ కనుకొలను
మ్యూజిక్ – హిప్ హాప్ తమిజ

కథ

యానాంలో చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌ ఉంటుంది. హాకీ కోచ్‌ మురళీ (మురళీ శర్మ) అక్కడి పేద క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తుంటారు. అలాంటి గ్రౌండ్‌ను అండర్‌ ఫర్ఫార్మింగ్‌ లిస్ట్‌లో చేర్చి.. క్రీడాశాఖ మంత్రి రావు రమేశ్‌(రావు రమేశ్‌) ఓ కార్పొరెట్ కంపెనీకి దారాదత్తం చేస్తాడు. అదేసమయంలో నేషనల్‌ లెవల్‌ టోర్నమెంట్‌ గెలిస్తే.. తమ గ్రౌండ్‌ దక్కించుకోవచ్చని భావించిన కోచ్ మురళీ.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. మరోవైపు యానాంలో ఉండే మావయ్య (పోసాని కృష్ణమురళీ) ఇంటికి వెళ్ళిన సంజు (సందీప్ కిషన్) అక్కడి హాకీ ప్లేయర్ లావణ్యతో ప్రేమలో పడతాడు. ఆమెకు సహాయం చేసే క్రమంలో హాకీ ఆడతాడు. అతడి ఆటను చూసి అందరూ షాకవుతారు. అసలు సందీప్‌ ఎవరు? అతను హాకీ గేమ్‌ని అంత అద్భుతంగా ఎలా ఆడాడు? చిట్టిబాబు గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కోచ్‌ మరళికి సందీప్‌ ఎలా సహాయపడ్డాడు? చివరకి చిట్టిబాబు గ్రౌండ్‌ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.

విశ్లేషణ

ఇప్పటివరకూ స్పోర్ట్స్ నేపథ్యంలో మన టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు రాలేదనే చెప్పొచ్చు. అందులోనూ హాకీ నేపథ్యంలో. ఇక స్పోర్ట్స్ రంగంపై పెద్దల పెత్తనం ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అక్కడ జరిగే రాజకీయాలవల్ల ఎంతో మంది జీవితాలు మధ్యలోనే ఆగిపోయిన సంఘటనలు చూశాం.. విన్నాం. ఇలాంటి పాయింట్ తోనే ఈ ప్రయోగం చేశాడు దర్శకుడు డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను. ఫస్టాఫ్‌ అంతా సింపుల్‌గా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌ నుంచి అసలు కథని చూపించాడు. సినిమా చివరి 20 నిమిషాలు మాత్రం అదిరిపోతుంది. మన దేశంలో ఒక క్రీడాకారుడికి జరుగుతున్న అన్యాయంతో పాటు స్నేహం గొప్పతనాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేశాడు. సీరియస్ మెసేజ్‌తో పాటు లవ్ ట్రాక్, కామెడీ, ఎమోషన్ అన్నీ బాగానే చూపించగలిగాడు. హాకీ ప్లేయర్స్‌కి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదని స్ట్రాంగ్‌గా చెప్పాలనుకున్న దర్శకుడి ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పొచ్చు.

నిర్మాతగా సందీప్ కిషన్ మొదటి సినిమా హారర్ జానర్ ను ఎంచుకుంటే, ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాను తీసుకున్నాడు. ఇక సందీప్ కిషన్.. హాకీ ప్లేయర్‌, రోమియోగా రెండు పాత్రల్లో చాలా తనను మౌల్డ్ చేసుకొని చాలా ఈజ్ తో చేసేశాడు. సిక్స్ ప్యాక్‌తో ఫుల్ మేకోవర్‌లో.. లాంగ్ హెయిర్ తో హాకీ ప్లేయర్‌గా కనిపించాడు. సందీప్ కిషన్‌కి ఎలాగూ హాకీలో టచ్ ఉండటంతో ఈజీగానే డీల్ చేయగలిగాడు. హాకీ క్రీడాకారిణిగా‌ లావణ్య త్రిపాఠి తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. అందంగా గ్లామర్‌గా కనిపించింది. సందీప్‌కి జోడీగా బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యింది.

సందీప్‌ కిషన్‌ తర్వాత హైలెట్ అయ్యేది మురళీ శర్మ పాత్ర. హాకీ కోచ్ పాత్రలొ ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఒక నిజాయతీగల కోచ్‌కు గేమ్‌పై, గ్రౌండ్‌పై ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో మరళీ శర్మ పాత్ర తెలియజేస్తుంది. ఇక రావు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.ఏ పాత్ర చేస్తే ఆపాత్రకు ప్రాణం పోస్తాడు ఆయన. అలానే ఈసినిమాలో కూడా అవినీతి రాజకీయ నాయకుడిగా నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పాలి. తన విలక్షణ నటనతో కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు.

రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శిలు ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో సందీప్‌కి స్నేహితులుగా అదరగొట్టేశారు. ఎమోషన్స్‌తో కట్టిపడేశారు. పాత్ర నిడివి తక్కువే అయినా వీరిద్దరి పాత్రే కీలకం. ఉన్నది కాసేపైనా రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శిలు హాకీ ప్లేయర్స్‌గా తమ తమ పాత్రల్లో జీవించేశారు. హీరో స్నేహితుడిగా సత్య తనదైన శైలిలో నవ్వించేశాడు. మహేశ్‌ విట్టా, పొసాని కృష్ణమురళి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ఇలాంటి సినిమాకు మెయిన్ సినిమాటోగ్రఫి కీలకం. కెవిన్ రాజ్‌ సినిమటోగ్రఫీ సూపర్ అని చెప్పొచ్చు. గ్రౌండ్ లో ఆటను చూపించిన విధానం, కెమెరా యాంగిల్స్ ఆకట్టుకుంటాయి. చివరి 25 నిమిషాలు తన కెమెరా పనితనాన్ని అద్భుతంగా చూపించాడు కెవిన్. సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్.

ఓవరాల్ గా చెప్పాలంటే స్పోర్ట్ నేపథ్యంలో సినిమాలను ఇష్టపడే వారికి తప్పక నచ్చుతుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 4 =