కస్టడీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

naga chaitanya custody movie ott release date fixed

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన సినిమా కస్టడీ. ఈసినిమా మే12 తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈసినిమాలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య నటన అందరినీ మెప్పించింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జూన్ 9వ తేదీ నుండి ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్ తో పాటు మళయాళ మరియు కన్నడ భాషల్లో కూడాా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్లలో మిస్ అయిన వారు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయోచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. అరవింద్ స్వామి, ప్రియమణి, సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.