యంగ్ టాలెంట్‌ ఎంక‌రేజ్ కోసం చ‌ర‌ణ్‌ కొత్త బ్యానర్

ram charan launches new production house to encourage new talent

టాలీవుడ్ లో హీరోలందరూ సొంత ప్రొడక్షన్ హౌస్ లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ బ్యానర్లలో తమ సొంత సినిమాలతో పాటు వేరే సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. అంతేకాదు యంగ్ టాలెంట్ ను సైతం ప్రోత్సహిస్తూ కొత్తగా వచ్చే వారికి కూడా అవకాశాలు అందిస్తున్నారు. ఇప్పుడు ఆ హీరోల జాబితాలో మరో స్టార్ హీరో చేరిపోయాడు. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస్కార్ విన్నింగ్ మూవీ RRRతో వ‌ర‌ల్డ్ వైడ్ గా పాపులారిటీని ద‌క్కించుకున్నాడు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చరణ్. ఆయ‌న యూవీ క్రియేష‌న్స్‌లోని త‌న స్నేహితుడు విక్ర‌మ్ రెడ్డితో చేతులు క‌లిపారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను, యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వీరిద్దరూ ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్‌ను ప్రారంభించారు. పాన్ ఇండియా ప్రేక్ష‌కులు మెచ్చేలా విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను ఈ సంస్థ రూపొందించ‌నుంది. అదే స‌మ‌యంలో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వేదిక‌గా మారుతుంది.

నిర్మాణ సంస్థ ‘వి మెగా పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌లో విల‌క్ష‌ణ‌మైన క‌థాంశాల‌తో పాటు తిరుగులేని వినోదాన్ని ప్రేక్ష‌కులకు అందిచంటానికి సిద్ధంగా ఉంది. సినీ నిర్మాణంలో అసాధార‌ణ‌మైన ఆస‌క్తి తో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌దనాన్ని అందించాల‌నే ఆలోచ‌న ఉన్న టీమ్ ఆధ్వ‌ర్యంలో ఈ నిర్మాణ సంస్థ ముందుకు సాగ‌నుంది. సినీ ప‌రిశ్ర‌మలో ఎవ‌రూ గుర్తించ‌ని ప్ర‌తిభ‌ను గుర్తించి ప్రోత్స‌హించాల‌నే దానికి క‌ట్టుబ‌డి ఉంది.

ఈ సంద‌ర్బంగా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. మా ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ విలక్ష‌ణ‌మైన ఆలోచనలను ఆవిష్క‌రిస్తూ స‌రికొత్త‌, వైవిధ‌మ్యైన వాతావ‌ర‌ణాన్ని పెంపొందించ‌టానికి సిద్దంగా ఉన్నాం. సృజ‌నాత్మ‌క‌త‌తో సినిమా స‌రిహ‌ద్దుల‌ను చెరిపేస్తాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీలో అభివృద్ధి చెందుతున్న టాలెంట్‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసి ఓ స‌రికొత్త ప్ర‌భావాన్ని చూపించ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.

యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ ఈ స‌రికొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌టం అనేది మాలో తెలియ‌ని ఆనందాన్ని క‌లిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో క‌లిసి వి మెగా పిక్చ‌ర్స్ ప‌ని చేయ‌నుంది. వెండితెర‌పై చూపించ‌బోయే స్టోరీ టెల్లింగ్‌లో ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకు రావాల‌నుకుంటున్నాం. దీని వ‌ల్ల సినీ ఇండ‌స్ట్రీ హ‌ద్దులు చెరిపేయ‌ట‌మే మా ల‌క్ష్యం అన్నారు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత బుచ్చిబాబు తో సినిమా చేయనున్నాడు. ఇటీవలే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కదా.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.