రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. అయితే పలు సినిమాలు తీసినా కూాడా కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు అశ్విన్. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో కొత్త కథతో వస్తున్నాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హిడింబ. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఈ సినిమాతో అశ్విన్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అంతేకాదు ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. మే 26వ తేదీన సాయంత్రం 7 గంటల 2నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజు చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు.
కాగా నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నారు. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: