సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ కథ, మేకింగ్.. అల్లు అర్జున్ నటన, మేకోవర్, యాస.. ఇంకా యాక్షన్ సీక్వెన్స్, సంగీతం అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా గ్లింప్స్. వీటికి వచ్చిన రెస్పాన్స్ తో పార్ట్ 2 కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమా ఈ డిసెంబర్ లో రిలీజ్ చేయడం కష్టమనే అంటున్నారు. మరోవైపు సుకుమార్ కూడా హడావిడిగా షూటింగ్ ను కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనుకోవట్లేదట. సెకండ్ పార్ట్ పై అంచనాలు ఎక్కువగా ఉండటంతో సుకుమార్ అదే రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఈనేపథ్యంలోనే మేకర్స్ వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా దిగాలని ప్లాన్ చేస్తున్నారట. మే లేదా జులై లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























