నటీనటులు :టొవినో థామస్,అపర్ణ బాలమురళి,అసిఫ్ అలీ,లాల్,వినీత్ శ్రీనివాసన్
సంగీతం : నోబిన్ పౌల్
సినిమాటోగ్రఫీ : అఖిల్ జార్జ్
ఎడిటింగ్ : చమన్ చాకో
దర్శకత్వం : జూడ్ అంథాని జోసెఫ్
నిర్మాతలు : వేణు కున్నపిల్లి,పద్మా కుమార్,అంటో జోసెఫ్,బన్నీ వాసు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మలయాళం లో సెన్సేషన్ సృష్టిస్తున్న సినిమా 2018, ప్రతి ఒక్కరూ హీరోనే అనేది క్యాప్షన్.గత కొన్ని రోజులుగా మాలీవుడ్ ను షేక్ చేస్తుంది. ఇప్పటికే 100కోట్లకు పైగాగ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా సరికొత్త రికార్డు సృష్టించింది.2018 లో కేరళ లో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కింది ఈసినిమా.ఇక ఈసినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు రిలీజ్ చేస్తున్నారు.రేపు థియేటర్లలోకి రానుంది అయితే సినిమా మీద వున్న నమ్మకంతో నిన్నస్పెషల్ ప్రీమియర్ షో వేశారు.మరి ఈసినిమా ఎలా వుంది.తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ :
2018లో కేరళ లో భారీ వరదలు సంభవిస్తాయి.డ్యామ్ పక్కన నివసిస్తున్న కుటుంబాలను ఆవరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.తమను తాము కాపాడుకోవడానికి ఎలాంటి సాహసాలు చేశారు.వరదల వల్ల వాళ్ళు ఏం కోల్పోయారు.ఎలా ఆ భారీ నష్టం నుండి బయటపడ్డారు అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
2018 లో కేరళ లో భారీ వరదలు సంభవించాయి.ఈవరదల తాకిడికి జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది.ఆస్థి నష్టం,ప్రాణ నష్టం జరిగింది.ఆవరదలు కేరళ కు ఊహించని షాక్ ఇచ్చాయి.ఈవరదల నుండి కోలుకోవడాని చాలా రోజులు పట్టింది.ఈయదార్థ సంఘంటలతోనే కథ రాసుకొని దాన్ని తెర మీదకు తీసుకొచ్చాడు డైరెక్టర్ జూడ్ అంథాని జోసెఫ్.కథలోకి వెళ్లేందుకు కొంచెం టైం తీసుకున్న ఆతరువాత టైట్ స్క్రీన్ ప్లే తో సినిమాను ఇంట్రెస్టింగ్ గా డీల్ చేశాడు.వరదల్లో చిక్కుకున్న వారి గురించి వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి.సినిమా ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అవుతుంది.సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా కథలో లీనమైపోతాం.ఫస్ట్ హాఫ్ సాఫిగా సాగిపోతుంది ఇక ఇంటర్వల్ నుండి నెక్స్ట్ లెవెల్లో సాగుతూ ఆకట్టుకుంటుంది.
క్యాస్టింగ్ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.తెర మీద అంత కొత్తవాళ్లనే చూసినా ఫీలింగ్ కలగడం సహజమే కానీ వారి యాక్టింగ్ సంతృప్తినిస్తుంది.కొన్నిపాత్రలు రిజిస్టర్ అయిపోతాయి.టొవినో థామస్,అసిఫ్ అలీ,లాల్,వినీత్ శ్రీనివాసన్ వారి పాత్రల్లో జీవించేశారు.
ఇక టెక్నికల్ విభాగం సినిమాకు ఊపిరి పోసింది.డైరెక్టర్ గా కథనాన్ని రక్తి కట్టించడంలో ఆంటోనీ జోసెఫ్ సక్సెస్ అయ్యాడు.ఒక సర్వైవల్ థ్రిల్లర్ ను ఎలా చూపించాలో అలాగే చూపించాడు. సినిమాటోగ్రఫి,ఎడిటింగ్ సినిమాను నిలబెట్టాయి.సాంగ్స్ ఓకే.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నీట్ గా వుంది.తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది.
ఓవరాల్ గా యదార్ధ సంఘటనలతో వచ్చినా ఈ 2018 రియలిస్టిక్ గా ఉండి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. ఈవారం ప్రతిఒక్కరూ తప్పకుండా చూసే సినిమా అని చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: