ఉప్పెన తో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి.ఈసినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆఫర్లు క్యూ కట్టాయి.ఉప్పెన తరువాత కృతి..శ్యామ్ సింగ రాయ్,బంగార్రాజు,వారియర్,మాచర్ల నియోజకవర్గం,ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి,కస్టడీ సినిమాల్లో నటించింది.ఇందులో కస్టడీ ఈరోజే విడుదలైంది.ఈసినిమాతో కృతి, తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.పుష్ప లో సమంత స్పెషల్ సాంగ్ చేసింది కదా అలా ఏమైనా మీకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే చేస్తారా అని అడిగిన ప్రశ్నకు కృతి రెస్పాండ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రజెంట్ అయితే చేసే ఆలోచన లేదు.నేను నేర్చుకుంది ఏంటంటే 100 పర్సెంట్ కంఫర్టబుల్ అయితేనే చేయాలి లేదంటే లేదు ప్రజెంట్ అయితే స్పెషల్ సాంగ్ ఆఫర్స్ నాకు కంఫర్టబుల్ కాదు సో నాకు ఖచ్చితంగా స్పెషల్ సాంగ్ చేసే ఆలోచన లేదు అలాగే పుష్పలో సమంత చాలా బాగా చేసిందని కృతి శెట్టి తెలియజేసింది.
ఇదిలావుంటే కృతి నటించిన చివరి మూడు సినిమాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు దాంతో కస్టడీ విజయం ఆమె కెరీర్ కు కీలకం కానుంది.ఇక కృతి ప్రస్తుతం మలయాళం లో ఓసినిమాలో నటిస్తుంది. కస్టడీ తరువాత తెలుగులో అయితే ఇంతవరకు మరో సినిమాకు సైన్ చేయలేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























