ఖుషి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

shiva nirvana kushi movie first single release date fixed

శివ నిర్వాణ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఖుషి. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శివ నిర్వాణ. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టింద చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే మ్యూజికల్ బ్లాస్ట్ అంటూ మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 9వ తేదీన ఈసినిమా ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ ఇంకా మలయాళంలో కూడా ఈపాటను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.