ఈ సమ్మర్ లో ఫుల్ పాజిటివ్ వైబ్ తో విడుదలవుతున్నసినిమా కస్టడీ.స్టిల్స్,టీజర్ తో సినిమా కు సూపర్ హైప్ రాగ ఈశుక్రవారం ట్రైలర్ కూడా విడుదలకానుంది.ఇక ట్రైలర్ కూడా అదిరిపోయిందని టాక్.యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన ఈసినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేశారు.విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో సినిమాను భారీ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు.ముఖ్యంగా నాగ చైతన్య వరస ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ గా వున్నాడు.మీడియాకు ఇంటర్వ్యూ లు ఇవ్వడం అలాగే సోషల్ మీడియా లో క్రేజ్ తెచ్చుకున్న వారితో కలిసి సినిమా ను ప్రమోట్ చేస్తున్నాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కిన ఈసినిమా లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అరవింద స్వామి విలన్ పాత్రలో కనిపించనున్నాడు.కస్టడీలో అరవింద స్వామి పాత్ర హైలైట్ కానుందట.యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాకు ఇళయరాజా,యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు.ఈనెల 12న ఈసినిమా విడుదలకానుంది.ఇక కస్టడీ తనకు బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఇస్తుందని నాగ చైతన్య సూపర్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.మరి ఈసినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























