ఈ శుక్రవారం రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు అలాగే ఒక హాలీవుడ్ మూవీ థియేటర్లలోకి రానుంది. అవి..రామబాణం,ఉగ్రం సినిమాలు కాగా మరొకటి గార్డియన్స్ ఆఫ్ ది గాలక్సీ వాల్యూమ్ 3.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లక్ష్యం,లౌక్యంతో హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు మ్యాచో హీరో గోపించంద్,డైరెక్టర్ శ్రీవాస్. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమానే రామబాణం.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం తో సినిమాకు హైప్ వచ్చింది.గత కొద్దీ రోజులనుండి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.
ఇక వరుసపరాజయాల తరువాత నాందితో సూపర్ హిట్ కొట్టి ట్రాక్ లో వచ్చాడు అల్లరి నరేశ్.విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు.ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ఉగ్రం వస్తుంది.రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.నాంది లోలాగే ఉగ్రం లోకూడా సీరియస్ రోల్ లో కనిపించనున్నాడు అల్లరి నరేశ్.మిర్న హీరోయిన్ గా నటించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.షైన్ స్క్రీన్స్ నిర్మించింది. మరి ఈసినిమాకూడా నాంది రిజల్ట్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.
ఈరెండు సినిమాలతో పాటు హాలీవుడ్ మూవీ గార్డియన్స్ ఆఫ్ ది గాలక్సీ వాల్యూమ్ 3 కూడా విడుదలకానుంది.ఇంగ్లీష్ తోపాటు తెలుగు, హిందీ,తమిళ భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























