హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా సీతారామం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో హను రాఘవపూడి కథ ముఖ్యంగా హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయి పోయారు. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ అందించి మేకర్స్ కు మంచి లాభాలు అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ క్లాసిక్ హిట్ కు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈసినిమాకు మరో అవార్డ్ వచ్చి చేరింది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సీతారామం మూవీ గెలుచుకుంది. పదమూడవ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్‌లో జ్యూరి కేటగిరీలో సీతారామం ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఇక ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా సోషల్ మీడియా ద్వారా తెలిచేస్తూ తమ సినిమాకు ఈ గౌరవం దక్కినందుకు గాను ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
We’re grateful to the Jury of 13th Dada Saheb Phalke Film Festival for acknowledging our #SitaRamam as the Best Film – Jury of the year 2023.
Humbled by this recognition ❤️🙏@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema pic.twitter.com/gnxdD1VUn8
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 1, 2023
కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా ఒక కీలక పాత్రలో నటించింది. ఈసినిమాను వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























