Nani30లో శ్రుతి హాసన్

shruti hassan joins in nani 30 movie

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నాని30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఈసినిమాలో కూడా నాని డిఫరెంట్ పాత్రలో నటించనున్నాడు. 6ఏళ్ల కూతురికి తండ్రిగా ఈసినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం అయితే గోవాలో కీలక షెడ్యూల్ తో చిత్రయూనిట్ బిజీగా ఉంది. అక్కడ షెడ్యూల్ లో మేజర్ కాస్ట్ అంతా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా జాయిన్ అయింది. ఈసినిమాలో శృతి హాసన్ నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రుతి హాసన్ ఈరోజు గోవాలో షూటింగ్‌లో జాయిన్ అయింది. కాగా ఈ ఏడాది ఆరంభంలోనే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకుంది.

కాగా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.