రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు ఆశిష్. మొదటి సినిమాతో తన నటనతో ఆకట్టుకున్నాడు. నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో ఆశిష్ హీరోగా వస్తున్న సినిమా సెల్ఫిష్. ఈసినిమాలో ఆశిష్ ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను బట్టి అర్థమవుతుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మే 1వ తేదీన ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ దిల్ ఖుష్ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ఫ్యాషన్, స్పోర్టింగ్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Mee andhari DIL ni KUSH cheyaneeki ma modhati paata vasthundhi 🤩#Selfish Dil ka First Beat 🎶 #DilKush Song on May 1st ❤️
A @MickeyJMeyer Musical 🎹#Ashish @_Ivana_official @aryasukku #DilRaju #KasiVishal @SVC_official @SukumarWritings @Ashokbandreddi @adityamusic pic.twitter.com/2JxFKCeE01
— Sri Venkateswara Creations (@SVC_official) April 29, 2023
కాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాను సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మణికందన్ పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































