ఏమాయ చేసావె మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి మూవీ తోనే తెలుగు సినీ ప్రేమికులను ఫిదా చేసి ఆతరువాత టాలీవుడ్ లో వరుస సినిమాల అవకాశాలను దక్కించుకుంది. కెరీర్ లోనే లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని వరుస హిట్లను అందుకోవడంతో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. తను సినీ కెరీర్ ప్రారంభించి 13 ఏళ్లు అయిపోతున్నా కూడా ఇప్పటికీ కూడా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే శాకుంతలం సినిమా రిలీజ్ అవ్వగా ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ లో దశలో ఉంది. ఇక నేడు సమంత పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి సామ్ కు బర్త్ డే విషెస్ అందించారు మేకర్స్. డీసెంట్ లుక్ లో ఉన్న సమంత పోస్టర్ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో సమంత పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Team #Kushi wishes the bundle of joy @Samanthaprabhu2, a very Happy Birthday ❤️
Keep spreading more kindness and happiness all around 🤩❤️@TheDeverakonda @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/F032oORuTH
— Mythri Movie Makers (@MythriOfficial) April 28, 2023
ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































