సల్మాన్ ఖాన్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం కిసీకా బాయ్ కిసీకీ జాన్.ఇటీవల ఈసినిమా నుండి విడుదలైన సాంగ్స్ కి సల్మాన్ వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.రేపు ఈసినిమా విడుదలవుతుంది.ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో రికార్డు క్రీయేట్ చేసింది.ఇండియాలో ఈసినిమా 4500 స్క్రీన్ లలో విడుదలకానుంది.ఆలెక్కన తొలి రోజు16000షోస్ పడనున్నాయి.అలాగే మిగితా దేశాల్లో మరో 1200స్క్రీన్ లలో విడుదలకానుంది.హిందీలో భారీ స్థాయిలో విడుదలవుతున్న సినిమా ఇదే.దాంతో మొదటి రోజు ఈసినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫర్హాద్ షంషీ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో వెంకటేష్,షెహనాజ్ గిల్,రాఘవ్ జుయల్,పాలక్ తివారి,సిద్ధార్థ్ నిగమ్,భూమిక కీలకపాత్రల్లో నటించగా జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు.పూజా హెగ్డే తెలుగు అమ్మాయి పాత్రలో నటించింది.సల్మాన్ ఖాన్ ఈసినిమాను నిర్మించాడు.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వీరమ్ కు రీమేక్ గా తెరకెక్కింది ఈసినిమా.మరి ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి.ఇక ఈసినిమా తరువాత సల్మాన్,టైగర్ 3లో నటించనున్నాడు.దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత సల్మాన్,కత్రినా కలిసి నటించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























