ఏజెంట్ ట్రైలర్ రిలీజ్ : ఫ్యాన్స్ కు పండగే 

Agent Telugu Movie Trailer Out Now

ఈనెలలో వస్తున్న మరో మచ్ అవైటెడ్ మూవీ ఏజెంట్.ప్రస్తుతం ప్రమోషన్స్ చేయడంలో బిజీ గా ఉంది ఏజెంట్ టీం.అందులోభాగంగా ఈరోజు ఈసినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాకినాడలో జరిగింది. కొద్దిసేపటి క్రితం ఈసినిమా ట్రైలర్ ను విడుదలచేశారు.2:19నిమిషాల రన్ టైం తో వచ్చిన ఈట్రైలర్ ఫ్యాన్స్ ను ఫుల్ శాటిస్ఫై చేసింది.యాక్షన్ ప్యాకడ్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ లో అఖిల్ లుక్,యాక్షన్ సీన్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజువల్స్ హైలైట్ అయ్యాయి.ముఖ్యంగా ట్రైలర్ లో వచ్చే లాస్ట్ షాట్ వావ్ అనిపించింది.ఓవరాల్ గా అక్కినేని ఫ్యాన్స్ ఎలాంటి ట్రైలర్ కట్ కోసం ఎదురుచూసారో అలాంటి ట్రైలర్ తో వాళ్లను ఖుషి చేశాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాపై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.తన కెరీర్ లో బిగ్ బడ్జెట్ మూవీగా వస్తుంది ఏజెంట్.ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటరైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించనున్నాడు.ఈసినిమా 2:30 గంటల రన్ టైంతో రానుంది.సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈసినిమాకోసం ఓ స్పెషల్ సాంగ్ ను కంపోజ్ చేశాడు.ఈపాటలో అఖిల్ వేసే స్టెప్స్ విజిల్స్ వేయించేలా ఉంటాయట.మరి ఈసినిమా అఖిల్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈచిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఆమెకు ఇదే మొదటి సినిమా.హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు.ఈనెల 28న ఈసినిమా భారీ స్థాయిలో విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =