టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ కు ఆసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇప్పుడు మరో సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో సుధీర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. లావుగా ఉండే దుర్గా అనే పాత్రలో అలానే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈసినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి టీజర్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 14వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా కాగా ఈసినిమాలో ఈషా రెబ్బా, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తుండగా.. అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చీ కిరణ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























