టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వారసత్వంతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు శ్రీసింహా. మత్తు వదలరా అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీసింహా మొదటిసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త సినిమాలు చేయగా అవి అంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ప్రస్తుతం తను మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫణిదీప్ దర్శకత్వంలో శ్రీసింహా హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈమధ్య ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టరు మేకర్స్. దీనిలో భాగంగానే రీసెంట్ గానే శ్రీసింహా బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తాజాగా మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఏప్రిల్ 12 వ తేదీన ఉదయం 7 గంటల 36 నిమిషాలకు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈసినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. మసూద, బలగం సినిమాలతో ప్రస్తుతం కావ్య కూడా ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అకీవా బి సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: