ఆదిపురుష్ నుండి హనుమాన్ పోస్టర్ రిలీజ్

Hanuman Jayanthi Special Poster from Adipurush Out Now

ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ నుండి హనుమాన్ పోస్టర్ ను విడుదలచేశారు మేకర్స్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్బంగా ఈపోస్టర్ ను విడుదలచేశారు. వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ ,లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ,హనుమంతుడిగా దేవదత్తా నాగే అలాగే రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈసినిమా నుండి ఇది వరకు విడుదలైన పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగ తాజాగా విడుదలైన హనుమాన్ పోస్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. పోస్టర్లో దీక్షలో వున్నా హనుమాన్ గా దేవదత్తా కనిపించిగా బ్యాక్ గ్రౌండ్ లో రాముడిగా ప్రభాస్ కనిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈచిత్రం విఎఫ్ఎక్స్ స్టేజ్ లోవుంది. విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమా కావడంతో మంచి క్వాలిటీ తో విజువల్స్ ను అందించేలా సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్,కృష్ణన్ కుమార్,ఓం రౌత్,ప్రసాద్ సుతార్,రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమా ఈఏడాది జూన్16న హిందీతో పాటు తెలుగు ,మలయాళం,కన్నడ,తమిళ భాషల్లో 3డిలో విడుదలకానుంది.

ఇక ఇదిలావుంటే ప్రభాస్ ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ ఒకటి. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఈఏడాది సెప్టెంబర్ 28న ఈసినిమా విడుదలకానుంది. ఇక ఈసినిమాతో పాటు ప్రభాస్ ప్రస్తుతం మారుతీ డైరెక్షన్లో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.