ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభం

pawan kalyans ustaad bhagath singh movie shoot begins

మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. పవర్ స్టార్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. వాటిలో ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంతవరకూ నోచుకోలేదు. ఆమధ్య ఈసినిమా ఆగిపోయిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అలాంటిది ఏం లేదని అప్పుడే క్లారిటీ ఇచ్చారనుకోండి. మరోవైపు అలా ప్రకటించాడో లేడో సముద్రఖని సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి తన టాకీ పార్ట్ పూర్తి చేసేశాడు. దీంతో ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఆరోజు వచ్చేసింది. నేడు ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈవిషయాన్ని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్ రోజు వచ్చేసింది’ అంటూ ఏన్నాళ్లో వేచిన ఉదయం అనే సాంగ్ తో ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే ఏర్పాటు చేసిన భారీ ఇంటి సెట్ లో షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది.

కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్‌ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. మరి గబ్బర్ సింగ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం ఈసారి పవన్ తో హరీష్ శంకర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.