నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే

sai pallavi about her makeup and fitness secret

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏది వస్తే ఆపాత్ర కాకుండా.. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ తన అందం, అభిన‌యం, డ్యాన్స్ తో కోట్లాదిమంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా సాయిపల్లవి బిహేవియర్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటారు. అందుకే లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సైతం దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి తన మేకప్ గురించి.. ఫిట్ నెస్ గురించి చెబుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. మేకప్ గురించి చెబుతూ.. మేకప్ వేసుకుంటే నాపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందువలన నేను బయట ఎలా ఉంటానో అలాగే కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడతాను.. ఇక నా ఫిట్ నెస్ గురించే అంతా అడుగుతుంటారు. ఫిట్ గా కనిపించడానికి ప్రత్యేకంగా నేను ఎలాంటి కసరత్తులు చేయను. ఏ మాత్రం ఖాళీ దొరికినా నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను. అదే నా ఫిట్ నెస్ కి కారణం. నాకు ఎంతో ఇష్టమైన డాన్స్ నాకు ఇంతటి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.