తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సినిమా, ఛత్రపతి ఇప్పుడూ హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈరీమేక్ లో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. హిందీలో శ్రీనివాస్ కు ఇదే మొదటి సినిమా. ఒరిజినల్ వెర్షన్ టైటిల్ తోనే తెరకెక్కుతున్న ఈచిత్రానికి వివి వినాయక్ దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 61 నిమిషాల నిడివి తో వచ్చిన ఈ టీజర్ ను యాక్షన్ సీన్స్ తో నింపేశారు. ఒరిజినల్ వెర్షన్ ను అలాగే హిందీలో తీస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈచిత్రంలో నుశరత్ బరూచా ,హీరోయిన్ గా నటిస్తుండగా భాగ్యశ్రీ ,శరద్ కేల్కర్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తనిష్క్ బాఘ్చి సంగీతం అందిస్తున్నాడు. మే 12 న ఈ సినిమా థియేటర్లోకి రానుంది.
ఇక తెలుగులో ఛత్రపతి ,ప్రభాస్ కు బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించి మాస్ హీరోగా నిలబెట్టింది. టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈచిత్రంలో శ్రీయా హీరోయిన్ గా నటించగా కీరవాణి సంగీతం అందించారు. మరి ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఈ సినిమా తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మళ్ళీ తెలుగులో నటించనున్నాడు. తన 10వ సినిమాను ,భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపి ఆచంట నిర్మించనున్న ఈచిత్రం త్వరలోనే లాంచ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























