బెల్లంకొండ సురేష్ వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పటివరకూ పలు సినిమాలు చేసిన సాయి శ్రీనివాస్ చివరిగా రాక్షసుడు సినిమాతో మొదటి హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో తెలుగులో వచ్చిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. 2005లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించి స్టన్నింగ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈసినిమాతో ప్రభాస్ కు మాస్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదే సినిమాను రీమేక్ చేస్తున్నాడు. తెలుగు ఓరిజినల్ స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాదే ఇప్పుడు హిందీ రీమేక్ కు కూడా కథను అందిస్తుండగా.. వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి శ్రీనివాస్ తన కెరీర్ గురించి, ఛత్రపతి రీమేక్ గురించి పలు విషయాలు తెలియచేశాడు. ఛత్రపతి రీమేక్ సినిమా షూటింగ్ పూర్తయింది.. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని తెలిపారు. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అర్జున సురవరం సినిమాతో హిట్ కొట్టిన టీఎన్ సంతోష్ దర్శకత్వంలో చేయబోతున్నాను.. ఛత్రపతి సినిమా రిజల్ట్ సినిమా చూసిన తరువాత ఈసినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ ఇంకా ఇతర లాంగ్వేజస్ లో రిలీజ్ చేయాలా లేదా అన్నది ఆలోచిస్తాం అని తెలిపాడు.
గుజరాత్ లోని భవ్ నగర్ లో ఛత్రపతి సినిమా షూటింగ్ చేశాం.. అవుట్ పుట్ అయితే బాగా వచ్చింది.. డిసెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు.
ఈసినిమా ప్రభాస్ ఛత్రపతి సినిమాకు రీమేక్ అయినా కూడా నా స్టైల్ లో నేను చేశాను.. అడియన్స్ ఇది ఫ్రెష్ ఫీలింగ్ ను ఇస్తుందన్న నమ్మకం నాకు ఉందని తెలిపాడు.
నిర్మాతలు దవల్ జయంతిలాల్ గడ ఇంకా అక్షయ్ జయంతిలాల్ నిర్మాతలతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది.. సినిమా షూటింగ్ అయితే పూర్తి చేశాం ఇక ఇప్పుడు ఈసినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి ఎలా ప్రమోషన్ చేస్తారన్నది వారిపై ఆధారపడి ఉంది.. మంచి టీమ్ అయితే ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఏపీలో ఎలా ప్రమోట్ చేయాలో నాకు తెలుసు అని స్పష్టం చేశారు.
ప్రభాస్ ఛత్రపతి సినిమా 2005లో రిలీజ్ అయింది.. నేను ఈసినిమాను చూశాను.. అయితే నేను కాస్త డిఫరెంట్ అప్రోచ్ తో వస్తున్నాను.. నా స్టైల్ లో నేను నటించి.. నా నుండి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను.. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా అంటు తెలిపాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: