ప్రస్తుతం బాలీవుడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్స్ హవా నడుస్తుంది. ఏ క్రేజీ ప్రాజెక్ట్ చూసినా మన సౌత్ హీరోయిన్స్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ జవాన్ లో కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 3న వరల్డ్ వైడ్ గా, పాన్ ఇండియా రేంజ్ లోనూ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ఫ్యామిలీమెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సమంత ప్రస్తుతం ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. సమంత కథానాయికగా పలు పలు బాలీవుడ్ మూవీస్ చర్చల్లో ఉన్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కన్నడ, తెలుగు భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ నేషనల్ క్రష్ గా మారిన రష్మిక ప్రస్తుతం సూపర్ హిట్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ లవ్ స్టోరీ యానిమల్.లో హీరోయిన్ గా నటిస్తున్నారు.. ఈ మూవీలో రష్మిక పాత్ర ఎంతో రెబల్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అమల పాల్, అజయ్ దేవ్ గణ్ హీరోగా, ఆయన డైరెక్షన్ లోనే తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ భోళా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. తమిళ సూపర్ హిట్ మూవీ ఖైదీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ బాలీవుడ్ మూవీలో నటించడం అమలాపాల్ కు కెరీర్ పరంగా అడ్వాంటేజ్ కాబోతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: