యంగ్ హీరో నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ,గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ రాగా కొద్దిసేపటి క్రితం టీజర్ విడుదలైంది. 88 సెకండ్ల నిడివి గల ఈటీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ లో హైలైట్ అయ్యాయి. మొత్తానికి టీజర్ ప్రామిసింగ్ గా ఉండి సినిమా పై అంచనాలను పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కస్టడీ టీజర్:
ఈ చిత్రంలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరు కలిసి నటించడం ఇది రెండో సారి. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘బంగార్రాజు’ సూపర్ హిట్ అయ్యింది.కస్టడీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు. శరత్ కుమార్ , ప్రియమణి , ప్రేమ్ జీ , వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న తెలుగు తోపాటు తమిళ భాషల్లో విడుదలకానుంది.
ఇక సినిమాలే గాక నాగ చైతన్య ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ , చైతన్య కాంబినేషన్ లో అమెజాన్ ప్రైమ్ ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసింది. ఈ సిరీస్ కు టైటిల్ కూడా ఖరారైంది. క్రైం థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసిరీస్ కి ‘దూత’ అనే టైటిల్ పెట్టారు. మూడు సీజన్లు గా రానున్న దూత లో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























