దసరా కంపేరిజన్ పై నాని ఎపిక్ రిప్లై

Nani epic reply to people comparing Dasara movie with Pushpa and Rangasthalam

న్యాచురల్ స్టార్ నాని గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సహజంగా నటిస్తాడు కాబట్టే న్యాచురల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక నాని ఇప్పటి వరకూ తను చేసిన సినిమాలు వేరు.. ఇప్పుడు వస్తున్న దసరా సినిమా వేరు అని చెప్పొచ్చు. తన కెరీర్ లో మాస్ పాత్రలో చేశాడు కానీ ఇంత ఊర మాస్ పాత్రలో చేయడం మాత్రం ఇదే మొదటిసారి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సింగరేణి బొగ్గు కార్మికుల జీవితం ఆధారంగా ఆసక్తికర మలుపులతో యాక్షన్ రస్టిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా నాని చాలా జోరుగా పాల్గొంటున్నాడు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచగా.. రీసెంట్‌గా రీలిజ్ అయిన ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. కంప్లీట్ మాస్ మేకోవర్, తెలంగాణ స్లాంగ్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు కంపేరిజన్స్ కూడా ఈ మధ్య వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. దసరా సినిమా పుష్ప, రంగస్థలం సినిమా కంటే ఎలా డిఫరెంట్ గా ఉంటుంది.. అంతేకాకుండా దసరా ను కె.జి.యప్ తో పోలుస్తున్నారు వారికి సమాధానం చెప్పండి అంటూ నానిని కోరగా.. నాని స్పందిస్తూ తన వెటకార శైలిలో రిప్లై ఇచ్చాడు. షారుఖ్ ఖాన్, ఆర్నాల్డ్ ఇద్దరూ ఒకేలాంటి జాకెట్ లు వేసుకున్నంత మాత్రాన డీడీజేఎల్(దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే), టర్మినేటర్ సినిమాలు రెండూ ఒకటే కాదు కదా అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో నాని ఇచ్చిన రిప్లైకు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =