మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న వాల్తేరు వీరయ్య మూవీ ప్రపంచవ్యాప్తంగా 225 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి భారీ ప్రాఫిట్ తో దూసుకుపోతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. తాజాగా ఈ మూవీ ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ సినిమాల్లో 400 కోట్లతో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా బాహుబలి -2 , అల వైకుంఠపురములో సినిమాలు తర్వాతి స్థానంలో నిలిచాయి. మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు 180 కోట్లతో నాల్గవ ప్లేస్ లో ఉండగా.. ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి వాల్తేరు వీరయ్య మూవీ 32 రోజుల్లో 190 కోట్ల వసూళ్లను సాధించి నాల్గవ ప్లేస్ లో నిలిచింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























