ఒకనాటి అందాలతార శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో ఎన్నో ఏళ్లు ఏలారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఇక శ్రీదేవి చనిపోయిన తరువాత ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎంట్రీపై ఎన్నో వార్తలు వచ్చాయి. మహేష్ బాబు కు జోడీ అన్నారు.. రామ్ చరణ్ తో అన్నారు.. కానీ అవన్నీ వార్తలకే పరిమితమయ్యారు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాలో దాదాపు జాన్వీ కపూర్ నటించే అవకాశాలే ఉందంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. త్వరలో ఒక తమిళ స్టార్ హీరో సినిమాలో జాన్వీ కపూర్ నటించనున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ వార్తలపై స్పందిస్తూ జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా జాన్వీ ఏ తమిళ మూవీలో నటించడం లేదని, అయితే ఒకవేళ అటువంటి ఆఫర్ తనకు వస్తే తప్పకుండా తామే అధికారికంగా దానిని వెల్లడిస్తాం అని క్లారిటీ ఇచ్చారు. మరి చూద్దాం జాన్వీ కపూర్ సౌత్ కి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తుందా లేక తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇస్తుందా అన్నది..
కాగా ప్రస్తుతం జాన్వీ కపూర్ హిందీలో తన కెరీర్ ను బాగానే కొనసాగిస్తుంది. ధఢక్ మూవీ ద్వారా బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత నుండి ఒక్కో సినిమాతో మంచి సక్సెస్ లతో పాటు నటిగా ఆడియన్స్ నుండి మంచి ఆదరణనే సొంతం చేసుకుంటుంది. ఇక ఇటీవల మిలి ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మరొక విజయం అందుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























