మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్లను అందుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు. 2021 లో రవితేజ తో క్రాక్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈసినిమాతోనే ఎప్పటినుండో వరుస ఫ్లాప్స్ ను ఎదుర్కొంటున్న రవితేజకు కూడా హిట్ దక్కింది. ఇక క్రాక్ తరువాత గోపీచంద్ మలినేని బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను తీశాడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో మాస్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిన ఈసినిమా సంక్రాంతికి బరిలోకి దిగి ఎలాంటి విజయం దక్కించుకుందో చూశాం. బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈసినిమాతో గోపీచంద్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా తరువాత గోపీచంద్ మలినేని ఎవరితో సినిమా చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రస్తుతం చర్చల్లో ఉన్నానని తెలిపాడు. అంతేకాదు ఇంకా పలు హీరోలతో కూడా చర్చల్లో ఉన్నానని.. ముందు స్క్రిప్ట్ ను పూర్తి చేసిన తరువాత హీరోను ఎంపిక చేస్తానని చెప్పాడు. అయితే ముందు కొద్దిరోజులు బ్రేక్ తీసుకొని ఆతరువాత తన తరువాత ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తానని తెలిపాడు. మరి ప్రభాస్ కనుక ఒప్పుకొని సినిమా ఓకే అయితే ఒక క్రేజీ కాంబినేషన్ ను చూడవచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































